YSRCP Released : రీజినల్ కోఆర్డినేటర్లు..ప్రెసిడెంట్ల ఎంపిక
వైఎస్సార్సీపీలో కీలక మార్పులు చేసిన సీఎం
YSRCP Released : ఏపీలో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ చీఫ్, సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి కీలక మార్పులు చేశారు. పలువురికి బాధ్యతలు అప్పగించారు.
ఇందులో భాగంగా పార్టీకి సంబంధించి ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులను(YSRCP Released) ప్రకటించారు. అనుబంధ విభాగాల కోఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించారు. పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గా ఉన్న విజయ సాయి రెడ్డి ఉన్నారు.
రీజినల్ కోఆర్డినేటర్లుగా శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా బొత్స సత్యనారాయణ, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల కోఆర్డినేటర్ గా వైవీ సుబ్బారెడ్డిని నియమించారు.
కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, కోనసమీ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల కోఆర్డేటర్ గా పిల్లి సుభాష్, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కోఆర్డినేటర్లుగా మర్రి రాజశేఖర్ , ఆళ్ల అయోధ్య రామి రెడ్డిని ఎంపిక చేశారు. పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల కోఆర్డినేటర్లుగా భూమన కరుణాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావును నియమించారు.
నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల కోఆర్డినేటర్ గా బాలినేని శ్రీనివాస్ రెడ్డి, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల కోఆర్డినేటర్ గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించారు.
కర్నూలు, నంద్యాల జిల్లాల కోఆర్డినేటర్ గా అమర్ నాథ్ రెడ్డిని ఎంపిక చేశారు సీఎం. జిల్లా అధ్యక్షుల వారీగా చూస్తే శ్రీకాకుళం పార్టీ అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణ దాస్ , విజయనగరంకు మజ్జి శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లాకు పరీక్షిత్ రాజు, అల్లూరు జిల్లాకు కె. భాగ్యలక్ష్మి, విశాఖపట్నంకు పంచకర్ల రమేష్ , అనకాపల్లికి కరణం ధర్మశ్రీని నియమించారు.
కాకినాడకు కురసాల కన్నబాబు, కోనసీమకు పి. సతీష్ కుమార్ , తూర్పుగోదావరి జిల్లా చీఫ్ గా జక్కంపూడి రాజా, పశ్చిమ గోదావరి జిల్లాకు శ్రీరంగనాథ రాజు ను నియమించారు.
ఏలూరు జిల్లాకు ఆళ్ల నాని, కృష్ణా జిల్లాకు పేర్ని నాని, ఎన్టీఆర్ జిల్లాకు వెల్లంపల్లి, గుంటూరు జిల్లాకు డొక్కా మాణిక్యవర ప్రసాద్, బాపట్లకు మోపిదేవి వెంకట రమణ, పల్నాడుకు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ప్రకాశం జిల్లాకు జంకె వెంకట్ రెడ్డి, నెల్లూరు జిల్లాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నియమించారు జగన్ రెడ్డి.
కర్నూలు జిల్లాకు రామయ్య, నంద్యాలకు కాటసాని రాంభూపాల్ రెడ్డి, అనంతపురం జిల్లాకు పైలా నరసింహయ్య, శ్రీ సత్యసాయి జిల్లాకు శంకర నారాయణ, కడప జిల్లాకు సురేష్ బాబు, అన్నమయ్య జిల్లాకు జి. శ్రీకాంత్ రెడ్డి, చిత్తూరు జిల్లాకు నారాయణ స్వామి, తిరుపతికి ఎన్. రామ్ కుమార్ రెడ్డిని నియమించారు సీఎం.
Also Read : ఆధునిక టెక్నాలజీతో ఏపీలో భూముల సర్వే