YSRCP Third List Released: వైసీపీ మూడో జాబితా విడుదల ! 6 ఎంపీ, 15 అసెంబ్లీ స్థానాలతో మూడో జాబితా !

వైసీపీ మూడో జాబితా విడుదల ! 6 ఎంపీ, 15 అసెంబ్లీ స్థానాలతో మూడో జాబితా !

YSRCP Third List: వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ చార్జీలు, ఆశావాహులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మూడో జాబితాను ఏపి మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం రాత్రి విడుదల చేసారు. సుదీర్ఘ కసరత్తు తరువాత వైసీపీ(YSRCP) అధిష్టానం మరికొన్ని ఇన్ చార్జిల మార్పు చేస్తూ 6 ఎంపీ, 15 అసెంబ్లీ స్థానాలతో కలిసి మొత్తం 21 స్థానాలకు గాను మూడో జాబితాను విడుదల చేసింది. పార్టీ ముఖ్యనేతలతో చర్చించిన అనంతరం… సీఎం జగన్‌ మూడో జాబితాపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27 స్థానాలకు ఇన్‌ ఛార్జిలను ప్రకటించిన వైసీపీ అధిష్టానం మూడో జాబితాలో మరో 21 స్థానాలకు ఇన్ చార్జిలను నియమించింది. దీనితో ఇప్పటివరకు 59 స్థానాలకు వైసీపీ(YSRCP) అధిష్టానం ఇన్ చార్జిలను ప్రకటించగా… మిగిలిన 116 స్థానాలకు గాను మరో రెండు లేదా మూడు విడతల్లో ఇన్ చార్జిలను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

 

YSRCP Third List – మూడో జాబితాలో కొత్తగా నియమితులైన పార్లమెంట్‌ ఇన్‌ఛార్జిలు

శ్రీకాకుళం – పేరాడ తిలక్
విశాఖపట్నం – బొత్స ఝాన్సీ
ఏలూరు – కారుమూరు సునీల్‌ కుమార్‌
విజయవాడ – కేశినేని నాని
కర్నూలు – గుమ్మనూరు జయరాం
తిరుపతి – కోనేటి ఆదిమూలం

 

అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు

ఇచ్ఛాపురం – పిరియ విజయ
టెక్కలి – దువ్వాడ శ్రీనివాస్‌
చింతలపూడి (ఎస్సీ) – కంభం విజయరాజు
రాయదుర్గం – మెట్టు గోవిందరెడ్డి
దర్శి – బూచేపల్లి శివప్రసాదరెడ్డి
పూతలపట్టు (ఎస్సీ) – మూతిరేవుల సునీల్‌ కుమార్‌
చిత్తూరు – విజయానందరెడ్డి
మదనపల్లె – నిస్సార్‌ అహ్మద్‌
రాజంపేట – ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి
ఆలూరు – బూసినే విరూపాక్షి
కోడుమూరు (ఎస్టీ) – డాక్టర్‌ సతీష్‌
గూడూరు (ఎస్సీ) – మేరిగ మురళి
సత్యవేడు (ఎస్సీ) – మద్దిల గురుమూర్తి
పెనమలూరు – జోగి రమేష్‌
పెడన – ఉప్పాల రాము

ప్రస్తుతం శ్రీకాకుళం జెడ్పీ చైర్ పర్సన్ గా ఉన్న పిరియా విజయను ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ చార్జిగా పార్టీ అధిష్టానం నియమించడంతో… ఆమె స్థానంలో ఇచ్చాపురం జెడ్పీటీసిగా ఉన్న ఉప్పాడ నారాయణమ్మను జెడ్పీ చైర్మెన్ గా నియమిస్తూ పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.

Also Read : AP CM YS Jagan : సమ్మె విరమించుకున్న మున్సిపల్ కార్మికులు..శుభవార్త చెప్పిన జగనన్న

Leave A Reply

Your Email Id will not be published!