Yuvraj Singh : ‘యువీ’ ధీరుడు క్రికెట్ యోధుడు

యువీ బ‌ర్త్ డే గ్రీటింగ్స్

Yuvraj Singh : క్రికెట్ మ‌తంగా మారి పోయిన ప్ర‌స్తుత త‌రుణంలో, కాసులు డామినేట్ చేస్తున్న ప‌రిస్థితుల్లో ఓ వైపు ర‌క్తం నోట్లోంచి వ‌స్తున్నా దేశం కోసం ఆడిన క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్. కోట్లాది మంది భార‌తీయులు స‌గ‌ర్వంగా త‌ల ఎత్తుకునేలా చేసిన గొప్ప క్రికెట‌ర్ యువీ. ఇవాళ డిసెంబ‌ర్ 12న ఆయ‌న పుట్టిన రోజు. ఈ సంద‌ర్బంగా యువ‌రాజ్ సింగ్ ను గుర్తు చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

జ‌ట్టుకు ఎనలేని విజ‌యాలను అందించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. ఏ బౌల‌ర్ నైనా ఆడ‌గలిగే స‌త్తా క‌లిగిన క్రికెట‌ర్ గా గుర్తింపు పొందాడు. ఆల్ రౌండ‌ర్ , బ్యాట‌ర్ , హిట్ట‌ర్ , అద్భుత‌మైన ఫీల్డ‌ర్ కూడా. 20 ఏళ్ల‌కు పైగా సేవ‌లు అందించాడు. సిక్స‌ర్లు కొట్ట‌డంలో మొన‌గాడు.

ఓ వైపు క్యాన్స‌ర్ భూతం క‌మ్మినా ఎక్క‌డా చెక్కు చెద‌ర‌ని యోధుడు. ఇంకొక‌రైతే కుప్పుకూలి పోయే వారు. కానీ అంతులేని ఆత్మ విశ్వాసంతో త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు యువ‌రాజ్ సింగ్. ఇవాల్టితో ఆయ‌న‌కు 41 ఏళ్లు నిండాయి. పంజాబ్ లోని చండీగ‌ఢ్ లో డిసెంబ‌ర్ 12, 1981లో పుట్టాడు.

2000 లో కెన్యాపై తొలి వ‌న్డే ఆడాడు యువ‌రాజ్ సింగ్. 2003, అక్టోబ‌ర్ 16న న్యూజిలాండ్ తో టెస్టులో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇంట‌ర్నేష‌న‌ల్ కెరీర్ లో 402 మ్యాచ్ లు ఆడాడు యువ‌రాజ్ సింగ్ (Yuvraj Singh). మొత‌తం 11 వేల‌కు పైగా ర‌న్స్ చేశాడు. ఇందులో 17 సెంచ‌రీలు ఉన్నాయి. 71 హాఫ్ సెంచ‌రీలు న‌మోద‌య్యాయి.

త‌న క్రికెట్ కెరీర్ లో ఎన్నో రికార్డులు కూడా ఉన్నాయి. 2007 లో జ‌రిగిన టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఒకే ఓవ‌ర్ లో ఆరు సిక్స‌ర్లు కొట్టాడు. కేవ‌లం 12 బంతుల్లో అర్ద సెంచ‌రీ సాధించి చ‌రిత్ర నెల‌కొల్పాడు యువ‌రాజ్ సింగ్. టోర్నీలలో స‌త్తా చాట‌డం పెట్టింది పేరు. 2011లో జ‌రిగిన టోర్నీలో క్యాన్స‌ర్ తో పోరాడాడు.

కానీ ఆడడం మాన‌లేదు. అంతే కాదు 15 వికెట్లు తీశాడు. 362 ప‌రుగులు చేసి విస్తు పోయేలా చేశాడు. ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపిక‌య్యాడు. ఇంకా లెక్క‌కు మించిన రికార్డులు న‌మోద‌య్యాయి యువీపై. ఐపీఎల్ లో కూడా ప్రాతినిధ్యం వ‌హించాడు. క్యాన్స‌ర్ ను జ‌యించినా ఆశించిన రాణించ‌లేక పోయాడు.

దీంతో 2017లో క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు యువ‌రాజ్ సింగ్. యువీని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.

Also Read : ‘ఐర్లాండ్’ ఆఫ‌ర్ ‘సంజూ’ డోంట్ కేర్

Leave A Reply

Your Email Id will not be published!