రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఫీట్ సాధించాడు. తన అద్భుతమైన స్పిన్ మంత్రజాలంతో మరోసారి వికెట్లు కూల్చాడు. ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. కేవలం 4 ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు.
ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో అరుదైన ఘనతను సాధించాడు. ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డ్ బ్రేక్ చేశాడు. ఇప్పటి దాకా ఉన్న బౌలర్లను దాటేశాడు. తానే టాపర్ గా నిలిచాడు. అంతే కాదు ప్రస్తుతం జరుగుతున్న 16వ లీగ్ సీజన్ లో కూడా బెస్ట్ బౌలర్ రేసులో ముందంజలో కొనసాగుతున్నాడు.
గతంలో ముంబై ఇండియన్స్ కి ఆడాడు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆ మధ్య సంచలన ప్రకటన చేశాడు. ఐపీఎల్ లో తనకు ఇష్టమైన కెప్టెన్ సంజూ శాంసన్ అంటూ బాంబు పేల్చాడు. ఐపీఎల్ లో ఇప్పటి దాకా అత్యధిక వికెట్లు తీసిన బ్రావో రికార్డును దాటేశాడు యుజ్వేంద్ర చాహల్. 184 వికెట్లు తీశాడు. బ్రావో 183 వికెట్లు తీస్తే పీయూష్ చావ్లా 174 , అమిత్ మిశ్రా 172 , రవిచంద్రన్ అశ్విన్ 171 వికెట్లు తీసిన జాబితాలో ఉన్నారు.
క్యాష్ రిచ్ లీగ్ 2023లో 18 వికెట్లు పడగొట్టాడు. 32 ఏళ్ల యుజ్వేంద్ర చాహల్ 140కి పైగా లీగ్ మ్యాచ్ లు ఆడాడు. 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో అరంగేట్రం చేశాడు.
