Yuzvendra Chahal : యజ్వేంద్ర చహల్ ఈ పేరు ఇప్పుడు ఐపీఎల్ లో వినిపిస్తోంది ఎక్కువగా. మొన్నటికి మొన్న 2013లో తనకు జరిగిన ఘటన గురించి ప్రస్తావించాడు. చహల్ చేసిన కామెంట్స్ కలకలం రేగాయి.
ఇది పక్కన పెడితే ప్రస్తుతం జరుగుతున్న రిచ్ లీగ్ లో ఆరేంజ్ క్యాప్ అందుకునే బౌలర్ల జాబితాలో మనోడు టాప్ లో ఉన్నాడు. ఇప్పటి దాకా రాజస్థాన్ రాయల్స్ నాలుగు మ్యాచ్ లు ఆడింది.
ఎనిమిది వికెట్లతో సత్తా చాటాడు. తాజాగా మరో అరుదైన ఘనతను స్వంతం చేసుకున్నాడు యజ్వేంద్ర చహల్(Yuzvendra Chahal). అరుదైన మైలు రాయిని చేరుకున్నాడు.
లక్నో సూపర్ జెయొంట్స్ తో ముంబై వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో దుష్యంత చమీరాను ఔట్ చేయడం ద్వారా చహల్ అద్భుత రికార్డు నమోదు చేశాడు.
తన ఐపీఎల్ కెరీర్ లో 150 వికెట్లు తీసిన ఆరో బౌలర్ గా ఘనత వహించాడు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో డ్వేన్ బ్రావో 173 వికెట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు.
ఇక శ్రీలంక కు చెందిన లసిత్ మలింగ 170 వికెట్లు తీసి రెండో ప్లేస్ లో కొనసాగుతుండగా 166 వికెట్లతో అమిత్ మిశ్రా మూడో స్థానంలో నిలిచాడు.
ఇక నాలుగో ప్లేస్ లో 157 వికెట్లతో పీయూష్ చావ్లా, హర్బజన్ సింగ్ 150 వికెట్లతో కొనసాగుతుండగా యజువేంద్ర చహల్ ఆరో ప్లేస్ కు చేరుకున్నాడు.
ఇదే టోర్నీలో మరో ఘనతను సాధించే చాన్స్ ఉంది చహల్ కు. గతంలో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ మేనేజ్ మెంట్ చహల్ ను చేజిక్కించుకుంది.
Also Read : రాజస్థాన్ రాణించేనా లక్నో సత్తా చాటేనా