Subhash Chandra : రాజ్య‌స‌భ బ‌రిలో జీ సుభాష్ చంద్ర

ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిన మీడియా మొఘ‌ల్

Subhash Chandra : భార‌త దేశంలో మీడియా మొఘ‌ల్ గా పేరొందిన జీ గ్రూప్ (ఎస్సెల్) సంస్థ‌ల చైర్మ‌న్ సుభాష్ చంద్ర(Subhash Chandra) ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఎస్సెల్ గ్రూప్ చైర్ ప‌ర్స‌న్ గా ఉన్నారు.

రాజ‌స్తాన్ లో రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఐద‌వ అభ్య‌ర్థిగా పోటీలో నిల్చున్నారు. సుభాష్ చంద్ర కు భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌ద్ద‌తు ఇస్తోంది.

దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థికి ఇక్క‌డ గ‌ట్టి పోటీ నెల‌కొనే అవ‌కాశంఉంది. బీజేపీ మ‌ద్ద‌తుతో కొత్త‌గా స్వతంత్ర అభ్య‌ర్థిగా పోటీలో నిలిచారు సుభాష్ చంద్ర‌. ఇదిలా ఉండ‌గా రాజ‌స్తాన్ లో నాలుగు రాజ్య‌స‌భ స్థానాలు ఖాళీగాఉన్నాయి.

కాంగ్రెస్ కు మూడు స్థానాలు ఉండ‌గా బీజేపీ ఒక‌టి గెలిచే స్థితిలో ఉంది. ఐదో అభ్య‌ర్థిగా సుభాష్ చంద్ర(Subhash Chandra) ఎంట్రీతో నాలుగో సీటుకు ఇప్పుడు పోటీ నెల‌కొంది.

ఉత్త‌ర ప్ర‌దేశ్ వాసిగా బ‌య‌టి వ్య‌క్తి అయిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్ర‌మోద్ తివారీకి ఆయ‌న స‌వాల్ విసిరారు. ఈ త‌రుణంలో రాష్ట్రంలోని అధికార 

కాంగ్రెస్ పార్టీలో చెల‌రేగుతున్న ఆగ్ర‌హం, సీఎం అశోక్ గెహ్లాట్ వ‌ర్సెస్ స‌చిన్ పైల‌ట్ వైరం ఏ స‌మ‌యంలోనైనా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌నే ముంద‌స్తు 

ప్లాన్ తో బీజేపీ ఓ వ్యూహాత్మ‌క అడుగు ముందుకేసింది.

కాగా ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల ఎంపిక‌పై కాంగ్రెస్ పార్టీ ఆగ్ర‌హంతో ఉంది. ముగ్గురు కాంగ్రెస్ అభ్య‌ర్థులు ర‌ణ దీప్

సూర్జేవాలా, ముకుల్ వాస్నిక్ , ప్ర‌మోద్ తివారీని బ‌రిలోకి దింపింది పార్టీ హైక‌మాండ్.

వ‌సుంధ‌ర రాజే మంత్రివర్గంలోని మాజీ మంత్రి ఘ‌న్ శ్యామ్ తివారీ బీజేపీ అభ్య‌ర్థిగా ఉన్నారు. 200 మంది స‌భ్యులున్న రాజ‌స్తాన్ అసెంబ్లీలో

ఒక్కో అభ్య‌ర్థి గెల‌వాలంటే 41 ఓట్లు కావాలి.

కాంగ్రెస్ కు 108 మంది ఎమ్మెల్యేలు, బీజేపీకి 71 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారికి మిగులు ఓట్లు ఉన్నాయి. కానీ రెండో సీటు గెల‌వాలంటే

మ‌రో 11 ఓట్లు కావాలి. మూడో సీటు గెల‌వాలంటే కాంగ్రెస్ కు మ‌రో 15 ఓట్లు కావాలి.

Also Read : ఆరోగ్య మంత్రి అరెస్ట్ అక్ర‌మం – సీఎం

Leave A Reply

Your Email Id will not be published!