Zelensky : రష్యా తగ్గడం లేదు. దాడుల్ని ముమ్మరం చేసింది. బాంబుల మోత మోగిస్తోంది. మిస్సైళ్లను శరవేగంగా ప్రయోగిస్తోంది. ఓ వైపు అమెరికా మరింత ఆంక్షలు విధించాలని నాటో, యూరోపియన్ యూనియన్ దేశాలపై ఒత్తిడి పెంచుతోంది.
దీంతో రష్యా అమెరికాతో పాటు పశ్చిమ దేశాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఆర్థిక ఆంక్షలు పెంచుకుంటూ పోతే తాము గ్యాస్, ఆయిల్ సరఫరాను నిలిపి వేస్తామంటూ హెచ్చరించింది.
దీంతో బ్యారల్ ధర 300 డాలర్లకు చేరుకునే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. దీంతో అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు సైతం పునరాలోచనలో పడ్డాయి. ఈ తరుణంలో ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky )ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నాటో సభ్యత్వం విషయంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆ కామెంట్స్ కలకలం రేపాయి. నాటో సభ్యత్వం కోసం ఇక నుంచి కూటమిపై ఎలాంటి ఒత్తిడి చేయబోనంటూ స్పష్టం చేశాడు.
దీంతో పాటు రష్యాతో శాంతియుతమైన చర్చలకు తాను సిద్దంగా ఉన్నాననంటూ ప్రకటించాడు జెలెన్ స్కీ. ఆయన తాజాగా ఏబీసీ న్యూస్ ఛానల్ తో మాట్లాడాడు.
నెట్టింల్లో ఉక్రెయిన్ చీఫ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తమ దేశానికి ఓ ఆత్మ గౌరవం అంటూ ఉందని, ఇక నుంచి నాటోను తాను అడుక్కోవాల్సిన అవసరం లేదన్నాడు.
విచిత్రం ఏమిటంటే రష్యా గుర్తించిన ఉక్రెయిన్ రెబల్స్ విషయంలోనూ తాను సంప్రదింపులకు రెడీగా ఉన్నానంటూ ప్రకటించి విస్తు పోయేలా చేశాడు జెలెన్ స్కీ.
Also Read : పశ్చిమ దేశాలపై రష్యా కన్నెర్ర