Zelensky Time : ప్రపంచంలో నెంబర్ వన్ పత్రికగా పేరొందింది టైమ్. సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్ పై దాడులకు దిగుతోంది. ఇప్పటికే కోలుకోలేని ఆస్తి నష్టం సంభవించింది. వేలాది మంది చని పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు.
కానీ ఒకే ఒక్కడిని వధించాలని , నామ రూపాలు లేకుండా చేయాలని, కంటి కింద రాయి లాగా మారిన ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీని (Zelensky Time)మట్టు బెట్టాలని రష్యా చీఫ్ పుతిన్ ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు.
కానీ ఎక్కడా లొంగ లేదు. చిక్క లేదు. సరికదా దమ్ముంటే బయటకు రా అని సవాల్ విసిరాడు. ఇవాళ మాపై రష్యా దాడి చేస్తోంది. రేపొద్దున మీ దాకా రావచ్చు. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించాడు జెలెన్ స్కీ(Zelensky Time).
ఈ సందర్భంగా ఓ వైపు ప్రతికూతలు, కష్టాలు, ఇబ్బందుల మధ్య తన దేశాన్ని ఎలా కాపాడుకుంటూ వస్తున్నాడో తెలియ చేసేందుకు ప్రయత్నం చేసింది టైమ్.
ఈ మేరకు జెలెన్ స్కీ అంతరంగాన్ని, నాయకత్వ పటిమను తెలియ చేసే ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. టైమ్ తన మ్యాజ్ జైన్ పై వోలోడిమిర్ జెలెన్ స్కీ ముఖ చిత్రాన్ని ప్రచురించింది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ కథనం కలకలం సృష్టిస్తోంది. ప్రముఖ జర్నలిస్ట్ సైమన్ షుసర్ ఈ కథనాన్ని రాశారు. తనదైన ప్రపంచంలోకి తీసుకు వెళ్లడం ఖాయమని టైమ్ పత్రిక పేర్కొంది.
జెలెన్ స్కీ కష్టతరమైన సమయాల్లో దేశాన్ని ఎలా నడిపించాడనే దాని గురించి ఇందులో చూడొచ్చని తెలిపింది.
Also Read : మే 24న క్వాడ్ లీడర్స్ సమ్మిట్