Zelensky Nobel : ప్రపంచంలో ఎవరు ఎప్పుడు హీరో అవుతారో చెప్పలేం. కానీ ఒకే ఒక్క దేశం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ దేశమే ఉక్రెయిన్. ఇప్పటికే సగం జీవచ్చంలా మారింది.
ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీని (Zelensky Nobel)బతికి ఉండగానే మట్టు బెట్టాలని,
తన కంట్లో నలుసుగా మారిన ఆ దేశాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవాలని రష్యా చీఫ్ పుతిన్ నానా తంటాలు పడుతున్నాడు.
కానీ ఎక్కడా తగ్గడం లేదు ఉక్రెయిన్. ఓ వైపు చర్చలకు రెడీ అంటూనే ఇంకో వైపు యుద్దం చేస్తూ నానా బీభత్సం సృష్టిస్తోంది.
ఇది కేవలం సైనిక చర్య మాత్రమేనని పైకి చెప్పినా పూర్తిగా రక్తపాతాన్ని, రావణ కాష్టాన్ని రగిలిస్తున్నాడు పుతిన్.
యావత్ ప్రపంచం ఒకే స్వరంతో యుద్దం ఆపాలని కోరినా పట్టించు కోవడం లేదు. దాడుల పరంపర కొనసాగుతూనే ఉన్నది.
భద్రతా దళాలు తూటాలను ఎక్కు పెట్టాయి. రాకెట్లు, మిస్సైళ్లు ఇబ్బడి ముబ్బడిగా చెలరేగుతున్నాయి.
కానీ ఎక్కడా వెనక్కి ఒక్క అడుగు వేయడం లేదు. ఐక్య రాజ్య సమితి తీర్మానం చేసింది. అమెరికా కన్నెర్ర చేసింది.
యూరోపియన్ దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించాయి. ప్రపంచ కోర్టు వెంటనే దాడులను నిలిపి వేయాలంటూ ఆదేశించింది.
చివరకు అమెరికా పుతిన్ ను యుద్ద నేరస్తుడిగా ప్రకటించింది. అయినా పుతిన్ ఆగడం లేదు. వెనక్కి తగ్గడం లేదు. ఓ వైపు రష్యా మూకుమ్మడి దాడులకు తెగ బడినా వెన్ను చూపడం లేదు ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీ(Zelensky Nobel).
తన దేశం కోసం ఆయన సాగిస్తున్న పోరాటానికి యావత్ ప్రపంచం నివ్వెర పోతోంది. యూరోపియన్ రాజకీయ నాయకులు కొందరు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ కమిటీకి విన్నవించారు
. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. మార్చి 31 దాకా స్వీకరణ తేదీని పొడిగించాలని కోరారు. దీనిపై ఇంకా కమిటీ స్పందించ లేదు.
Also Read : రాకెట్ దాడిలో ఉక్రెయిన్ నటి ఒక్సానా మృతి