Indonesia Stampede : ఫుట్ బాల్ మ్యాచ్ లో తొక్కిసలాట
జకార్తాలో విషాదం 127 మంది మృతి
Indonesia Stampede : ఘోరమైన విషాదం చోటు చేసుకుంది. ఇండోనేషియాలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో(Indonesia Stampede) ఏకంగా 127 మంది చని పోయారు. ఓడి పోయిన పక్షం నుండి మద్దతుదారులు పిచ్ పై దాడి చేశారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. గుంపు తొక్కిసలాటకు దారి తీసింది. ఊపిరి ఆడకుండా పోయింది.
మలాంగ్ లోని కంజుర్ హాన్ స్టేడియం వెలుపల ఉద్రిక్తత చోటు చేసుకుంది. తూర్పు జావా ప్రావిన్స్ లో రాత్రిపూట ఫుట్ బాల్ మ్యాచ్ లో ప్రేక్షకుల ఇబ్బంది కారణంగా తొక్కిసలాట ఇబ్బందికి గురి చేసింది. 180 మంది గాయపడ్డారని ఇండోనేషియా పోలీసులు తెలిపారు. అరేమా ఎఫ్సీ , పెర్సెబయ సురబయ మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది.
మ్యాచ్ ముగిశాక ఓడి పోయిన జట్టు మద్దతుదారులు పిచ్ పై కి జొరబడ్డారు. చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. తీవ్రమైన తొక్కిసలాట , ఊపిరి ఆడకుండా పోయింది. ఈస్ట్ జావా పోలీస్ చీప్ నికో అఫింటా వెల్లడించారు. స్థానిక వార్తా ఛానెళ్ల నుండి వచ్చిన వీడియో ఫుటేజీలో ప్రజలు మలాంగ్ లోని స్టేడియంలోని పిచ్ పైకి దూసుకు పోతున్నట్లు కనిపించింది.
దీంతో ఇండోనేషియా టాప్ లీగ్ బీఆర్ఐ లిగా 1 మ్యాచ్ తర్వాత ఒక వారం పాటు ఆటలను సస్పెండ్ చేసింది. ఈ గేమ్ లో పెర్సెబియా 3-2 తో గెలిచింది. ఈ మొత్తం ఘటనపై దర్యాప్తుకు ఆదేశించింది ఇండోనేషియా ప్రభుత్వం.
ఎందుకు జరిగిందనే దానిపై ఇండోనేషియా ఫుట్ బాల్ అసోసియేషన్ విచారణ చేపట్టినట్లు తెలిపింది. గతంలో ఇండోనేషియాలో మ్యాచ్ లలో ఇబ్బందులు తలెత్తాయి.
Also Read : ఫుట్ బాల్ మ్యాచ్ లో పెరిగిన మృతుల సంఖ్య