Tata To Build : రూ. 13 వేల కోట్ల‌తో టాటా ఈవీ ప్లాంట్

గుజ‌రాత్ లో ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు టాటా

Tata To Build : టాటా గ్రూప్ సంస్థ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు గుజ‌రాత్ రాష్ట్రానికి తీపి క‌బురు చెప్పింది. టాటా(TATA) గ్రూప్ న‌కు చెందిన అనుబంధ సంస్థ టాటా అగ‌రాటాస్ ఎన‌ర్జీ స్టోరేజీ సొల్యూష‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 20 గిగావాట్ గంట‌ల ఉత్ప‌త్తి సామ‌ర్థ్యాన్ని క‌లిగి ఉండే ఎల‌క్ట్రిక్ వెహికిల్ బ్యాట‌రీ ప్లాంట్ ను ఏర్పాటు చేయ‌నుంది. ఈ మేర‌కు అవ‌గాహ‌న ఒప్పందంపై సంత‌కం చేసింది.

ఇందుకు సంబంధించి రూ. 13,000 కోట్ల‌తో ఈవీ బ్యాట‌రీ ప్లాంట్ ను నిర్మించ‌నుంది. టాటా ప్లాంట్ గుజ‌రాత్ ను లిథ‌ఙ‌యం బ్యాట‌రీ త‌యారీలో అగ్ర‌గామిగా నిలిచేలా చేస్తుంది. దీని అంచ‌నా ప్రారంభ పెట్టుబడి భారీగా పెట్ట‌నుంది. ఈ లిథియం బ్యాట‌రీ ఏర్పాటు వ‌ల్ల ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా 13 వేల మందికి పైగా ఉపాధి ల‌భిస్తుంద‌ని స్ప‌ష్టం చేస్తుంది. 20 గిగావాట్ గంట‌ల ఉత్ప‌త్తి సామ‌ర్థ్యాన్ని క‌లిగి ఉండే ఎల‌క్ట్రిక్ వాహ‌న బ్యాట‌రీ ప్లాంట్ ను స్థాపించ‌నుంది.

2070 నాటికి ప్ర‌పంచంలో అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన దేశాన్ని కార్బ‌న్ నెట్ జీరోగా మార్చే దిశ‌గా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కృషి చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ విద్యుత్ ర‌వాణాను అవ‌లంభించ‌డంలో భాత‌ర్ చైనా, అమెరికా దేశాల కంటే వెనుక‌బ‌డి ఉంది.
ఇదిలా ఉండ‌గా గుజ‌రాత్ ను లిథియం బ్యాట‌రీ త‌యారీలో అగ్ర‌గామిగా మారుస్తుంద‌ని , రాష్ట్రంలో ఉత్ప‌త్తి ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయ‌డంలో గ్రూప్ స‌హాయం పొందుతుంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. అయితే దీనిపై వ్యాఖ్యానించేందుకు ఒప్పు కోలేదు టాటా గ్రూప్.

Also Read : Bhola Shankar Song : మెగా భోళా శంక‌ర్ సాంగ్ అదుర్స్

 

Leave A Reply

Your Email Id will not be published!