Chattisgarh : ఛత్తీస్‌గఢ్ మావోయిస్టుల బాంబు దాడిలో ఇద్దరు జవాన్లు మృతి
దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది...
Chattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. నారాయణపూర్ జిల్లా దుర్బేరా సమీపంలోని కొడ్లియార్ అటవీ ప్రాంతంలో పోలీసులు, భద్రతా సిబ్బందే లక్ష్యంగా బుధవారం ఐఈడీని మావోయిస్టులు పేల్చారు. ఈ పేలుడులో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అత్యవసర చికిత్స కోసం క్షతగాత్రులను రాయ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఇక మృతి చెందిన జవాన్లలో ఒకరు ఆంధ్రప్రదేశ్(AP) కడప జిల్లాకు చెందిన కె. రాజేశ్, మరోకరు మహారాష్ట్రకు చెందిన అమర్ పన్వార్ అని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. వీరిద్దరు ఐటీబీటీ 53 బెటాలియన్‌కు చెందిన వారి చెప్పారు. అయితే మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి ఐటీబీపీ, బీఎస్ఎఫ్, డీఆర్‌జీ జవాన్లు తిరిగి వస్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకుందని పోలీస్ ఉన్నతాధికారులు వివరించారు.
Chattisgarh Maoist Bomb Attacks…
దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. 2026, మార్చి నాటికి భారత్‌ను మావోయిస్టు రహిత దేశంగా మార్చాలని నిర్ణయించింది. అందులోభాగంగా ఆపరేషన్ కగార్‌ను చేపట్టింది. దీంతో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా ఉన్న ఛత్తీస్‌గఢ్(Chattisgarh)లోని దండకారణ్యంలో తనిఖీలు ముమ్మరం చేసింది. అలాంటి వేళ.. ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారంలో దంతెవాడ, నారాయణపూర్ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 38 మంది మావోయిస్టులు మరణించారు. ఇది మావోయిస్టులకు భారీ దెబ్బ అని పోలీసులు ప్రకటించారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ స్పందించింది. అయితే శనివారం ఒక్కసారిగా భద్రతా దళాలే లక్ష్యంగా ఐఈడీ పేల్చడంతో.. తాము ఇంకా బలంగా ఉన్నామని ప్రభుత్వానికి ఒక సందేశం పంపినట్లు అయిందనే అభిప్రాయం సైతం పలువురులో వ్యక్తమవుతుంది.
Also Read : PM Kisan : రైతన్నలకు ఆ పథకం కింద 15 లక్షల సాయం