JP Nadda : రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి కోసం 20 పేర్లు ప‌రిశీల‌న‌

వెల్ల‌డించిన బీజేపీ నేష‌న‌ల్ చీఫ్ జేపీ న‌డ్డా

JP Nadda : దేశ వ్యాప్తంగా రామ్ నాథ్ కోవింద్ త‌ర్వాత త‌దుప‌రి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఎవ‌రు ఎంపిక అవుతార‌నే దానిపై ఉత్కంఠ‌కు తెర దించే ప్ర‌య‌త్నం చేసింది భార‌తీయ జ‌న‌తా పార్టీ. అంత‌కు ముందు విప‌క్షాలు త‌మ ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా య‌శ్వంత్ సిన్హాను ప్ర‌క‌టించింది.

ఈ త‌రుణంలో ఎన్డీయే భాగ‌స్వామ్య ప‌క్షాలు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాయి. ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు, తెలంగాణ‌, పుదుచ్చేరి గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్, భార‌త‌దేశ జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్, ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ , త‌దిత‌రుల పేర్ల‌ను ప‌రిశీలించింది.

మంగ‌ళ‌వారం రాత్రి జేపీ న‌డ్డా రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ఎంపిక విష‌యంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో బీజేపీపై తీవ్ర ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఆదివాసీలు, గిరిజ‌నులు, బీసీలు, మైనార్టీల‌ను ప‌ట్టించుకోద‌న్న విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకుంది. ఈ త‌రుణంలో ద‌ళితుడైన రామ్ నాథ్ కోవింద్ కు చాన్స్ ఇచ్చింది. ప్ర‌స్తుతం ఆదివాసీ బిడ్డ ద్రౌప‌ది ముర్ముకు అవ‌కాశం ఇచ్చి చ‌రిత్ర సృష్టించింది.

ఈ సంద‌ర్భంగా జేపీ న‌డ్డా మాట్లాడుతూ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి కోసం మొత్తం పార్టీ స‌మావేశంలో 20 పేర్ల‌ను ప‌రిశీలించామ‌న్నారు. చివ‌ర‌కు ఈసారి తూర్పు భార‌తం నుంచి ఆదివాసీ గిరిజ‌న మ‌హిళ‌ను అభ్య‌ర్థిగా ఎంపిక చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు చెప్పారు జేపీ న‌డ్డా(JP Nadda).

ఇదిలా ఉండ‌గా అన్ని పార్టీల అంగీకారంతో ఏక‌గ్రీవంగా రాష్ట్ర‌ప‌తిని ఎన్నుకోవాల‌ని ఆశించామ‌ని, కానీ పార్టీలు ఒప్పు కోలేద‌న్నారు బీజేపీ చీఫ్‌.

చివ‌రి నిమిషం వ‌ర‌కు ప్ర‌య‌త్నించాం. కానీ విప‌క్షాలు ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా య‌శ్వంత్ సిన్హాను ప్ర‌క‌టించడంతో తాము ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు జేపీ న‌డ్డా.

Also Read : అరుదైన రాజ‌కీయ‌వేత్త య‌శ్వంత్ సిన్హా

Leave A Reply

Your Email Id will not be published!