Rahul Gandhi Yatra : రాహుల్ యాత్రలో 26/11 బాధితురాలు
దేవికా రోటవన్ కు రాహుల్ గాంధీ అభినందన
Rahul Gandhi Yatra : దేశానికి ద్వేషం కాదు కావాల్సింది ప్రేమ కావాలంటూ కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆఖరి అంకానికి చేరుకుంది. జనవరి 31తో పూర్తి కాగా అదే రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఇప్పటికే దేశంలోని 24 పార్టీలకు ఆహ్వానం కూడా పంపింది.
గత ఏడాది సెప్టెంబర్ 7న తమిళనాడు లోని కన్యాకుమారి నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు రాహుల్ గాంధీ(Rahul Gandhi Yatra). ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ , రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ పూర్తయ్యాయి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో కొనసాగుతోంది.
ఈ సందర్భంగా అరుదైన సన్నివేశానికి వేదికైంది ఈ యాత్ర. ఓ వైపు చలి మరో వైపు వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా రాహుల్ గాంధీ తన పాదయాత్రను కొనసాగిస్తూ వస్తున్నారు. ఆదివారం ప్రారంభమైన భారత్ జోడో యాత్రలో 26/11 ఉగ్ర దాడిలో తీవ్రంగా గాయపడి కోలుకున్న దేవికా రోటవన్ పాల్గొన్నారు.
యువ నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి అడుగులో అడుగు వేశారు. దేశం బాగుండాలని, అంతా కలిసి ఉండాలని కోరుతూ చేపట్టిన ఈ యాత్రలో తాను పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు దేవికా రోటవన్. ఇప్పటికే రాజస్థాన్ ప్రభుత్వం సొంత ఇంటి కలను సాకారం చేసింది. ఈ సందర్భంగా దేవికాను యువ నాయకుడు రాహుల్ గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి వాళ్లే దేశానికి కావాలని పిలుపునిచ్చారు.
Also Read : బీజేపీపై కాంగ్రెస్ ఛార్జిషీట్