Yes Bank DHFL Fraud : రాణా..క‌పిల్..ధీర‌జ్ రూ. 5050 కోట్ల స్కాం

ఉద్దేశ పూర్వ‌కంగానే నిధులు దారి మ‌ళ్లింపు

Yes Bank DHFL Fraud : యెస్ బ్యాంక్ కో ఫౌండ‌ర్ రాణా క‌పూర్ , దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్) ప్ర‌మోట‌ర్లు క‌పిల్, ధీర‌జ్ వాధ్వాన్ లు రూ. 5, 050 కోట్ల విలువైన నిధుల‌ను స్వాహా చేశారంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ఆరోపించింది.

ఈ కేసులో రాణా క‌పూర్, అత‌ని ఫ్యామిలీ, వాధ్వాన్ లు, ఇత‌రుల‌పై ప్ర‌త్యేక కోర్టులో దాఖ‌లుచేసిన రెండో అనుబంధ ఛార్జిషీట్ లో ఈడీ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.

కేసు ద‌ర్యాప్తులో భాగంగా ఈ కేసులో ల‌భించిన నేరాల‌లో ఎక్కువ భాగాన్ని రాణా క‌పూర్ విదేశాల‌కు త‌ర‌లించార‌ని ఈడీ తెలిపింది. దాంతో మ‌నీ లాండ‌రింగ్ నిరోధ‌క చ‌ట్టంలోని రూల్స్ ప్ర‌కారం నేరుగా అటాచ్ మెంట్ కు అందుబాటులో లేర‌ని తేలిందని పేర్కొంది.

రాణా క‌పూర్ , డీహెచ్ఎఫ్ఎల్ ప్ర‌మోట‌ర్లు క‌పిల్ వాధ్వాన్ , ధీర‌జ్ వాధ్వాన్ , ఇత‌రులు అక‌మ్ర మ‌ళ్లింపు , అనుమాన‌స్పాద లావాదేవీల ద్వారా నిధుల‌ను స్వాహా చేశార‌ని ఈడీ వెల్ల‌డించింది.

అంతే కాకుండా ప‌ర‌స్ప‌రం నేర పూరిత కుట్ర‌ల‌కు పాల్ప‌డిందంటూ స్ప‌ష్టం చేసింది. తాజాగా ప్రాసిక్యూష‌న్ ఫిర్యాదులో పేర్కొంది. ఇటీవ‌లే దాఖ‌లు చేసింది.

డీహెచ్ఎఫ్ఎల్ నుంచి యెస్ బ్యాంక ఏప్రిల్ 2018 , జూన్ 2018 మ‌ధ్య రూ. 3, 700 కోట్ల విలువైన డిబెంచ‌ర్ల‌ను కొనుగోలు చేసిన‌ట్లు ద‌ర్యాప్తులో తేలింద‌ని వెల్ల‌డించింది ఈడీ.

దీంతో మొత్తం డీహెచ్ఎఫ్ఎల్ (Yes Bank DHFL Fraud)కు బ‌దిలీ చేశారని పేర్కొంది. డీహెచ్ఎఫ్ఎల్ డూఇట్ అర్బ‌న్ వెంచ‌ర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు రూ. 600 కోట్ల రుణాన్ని ఇచ్చింద‌ని తెలిపింది.

ఎలాంటి పూచీ క‌త్తు లేకుండానే వీటిని మంజూరు చేశారంటూ పేర్కొంది. రూ. 39.68 కోట్ల విలువైన నాసిర‌కం ఆస్తుల‌పై రూ. 600 కోట్ల రుణం ఇచ్చిన‌ట్లు ద‌ర్యాప్తులో వెల్ల‌డైంద‌ని ఈడీ స్ప‌ష్టం చేసింది.

వ్య‌వ‌సాయ భూమి నుంచి నివాస భూమిగా మార్చ‌డాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని రూ. 735 కోట్లు పెంచి చూపిన‌ట్లు తెలిపింది.

Also Read : ఉండేందుకు స్వంత గూడు లేదు

Leave A Reply

Your Email Id will not be published!