Delhi Airport 5G : ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో 5జీ సేవలు
ప్రయాణీకులకు బంపర్ ఆఫర్
Delhi Airport 5G : దేశంలోనే అత్యధిక ప్రయాణికులు ప్రయాణం చేసే ఏకైక ఎయిర్ పోర్ట్ దేశ రాజధానిలోని ఢిల్లీ ఎయిర్ పోర్టు. ప్రస్తుతం ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం కేంద్ర విమానయాన శాఖ పలు సేవలు అందిస్తోంది. తాజాగా అత్యంత వేగవంతమైన నెట్ వర్కింగ్ సేవలు అందుబాటులో ఉంచింది.
ఇందుకు గాను ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లో ఇక నుంచి 5జీ నెట్ వర్క్ సేవలు(Delhi Airport 5G) లభ్యమవుతున్నాయి. దీని వల్ల ప్రయాణీకులకు ఎనలేని సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ప్రయాణీకుల రద్దీ పెరగడంతో విమానాశ్రయాలలో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు ఉపయోగించే వారికి ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.
నెట్ కనెక్టివిటీ అనేది మరింత స్పీడ్ తో వినియోగించుకునే వీలు కలుగుతుంది. జీఎంఆర్ గ్రూప్ ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్ పోర్టు ను నిర్వహిస్తోంది. ఇవాళ ఢిల్లీ ఎయిర్ పోర్టు టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా ఈ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. 5జీ నెట్ వర్క్ ఎలా ఉందనే దానిపై ఇంకా ప్రయాణీకులు తమ అభిప్రాయాలను తెలియ చేయలేదు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం చాలా ఎయిర్ పోర్టులు వైర్ లెస్ సేవలను ప్రధానంగా వైఫై ద్వారా ప్రయాణీకులకు అందిస్తున్నాయి. కాగా వైఫై అనేది ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ ప్రకారం ఎవరైనా ఉపయోగించుకునే లైసెన్స్ లేని స్పెక్ట్రమ్ పై ఆధారపడి ఉంటుంది.
ఎయిర్ లైన్స్ , ఇతర ఎయిర్ పోర్టు వాటాదారులు కూడా డిమాండ్ కు అనుగుణంగా తమ అవసరమైన వాటికి సంబంధించి మరింత వేగవంతమైన కనెక్టివిటీని కోరుకుంటున్నారు. 5జీ నెట్ వర్క్ ప్రయాణీకులు అందుబాటులో ఉన్న వై ఫై సిస్టమ్ లో 20 రెట్లు వేగవంతమైన డేటా ను ఆస్వాదించ గలరని డయల్ తెలిపింది.
Also Read : రిచ్ లిస్ట్ లో నిఖిల్ కామత్ నెంబర్ వన్