Ashvini Vaishnaw : రైల్వేస్ ఆహారంపై 6 వేల ఫిర్యాదులు
ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్న మంత్రి
Ashvini Vaishnaw : రైల్వే శాఖ ఆధ్వర్యంలో రైళ్లల్లో ప్రయాణికులకు అందించే ఆహారంపై పెద్ద ఎత్తున పార్లమెంట్ లో గురువారం చర్చ జరిగింది. ప్రస్తుతం సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి ఇబ్బందులు లేకుండా చేస్తోంది రైల్వే శాఖ. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది.
కానీ దేశ వ్యాప్తంగా రైల్వేస్ అందిస్తున్న ఆహారంపై పెద్ద ఎత్తున ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ధర బయట కంటే ఎక్కువగానే ఉంటోందని కానీ నాణ్యత పాటించడం లేదంటూ వాపోతున్నారు. ప్రయాణానికి సంబంధించి టికెట్లు బుక్ చేసుకునే సమయంలోనే తినేందుకు ఏమేం కావాలనే దానిపై కూడా ఆర్డర్ తీసుకునే అవకాశం కల్పించింది రైల్వే శాఖ.
అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ఐఆర్సీటీసీ ఫుడ్ సర్వీస్ బాగా లేదంటూ ప్రయాణీకులు భగ్గుమంటున్నారు. ఇందుకు సంబంధించి సభ్యులు ప్రయాణికులకు సంబంధించి ఇస్తున్న ఆహారం, నాణ్యతపై ప్రశ్నించారు. దీనికి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్(Ashvini Vaishnaw) స్పందించారు.
గడిచిన ఏడు నెలల కాలంలో 6 వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ ఫిర్యాదులు ఆహార నాణ్యతపైనే ఉన్నాయని చెప్పారు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కి గత ఏడు నెలల్లో భారతీయ రైల్వేలలో ప్రయాణించే వారి నుంచి ప్రత్యేకించి ఫిర్యాదులు అందిన మాట వాస్తవమేనని తెలిపారు.
ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి చెప్పారు. అన్ని రకాల ప్రీమియం రైళ్లు రాజధాని, శతాబ్ధి, దురంతో, గతిమాన్ , తేజస్ , వందే భారత్ లో ముందస్తు బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కేంద్ర మంత్రి.
Also Read : గాంధీ విలువలు నిలబడేలా చేశాయి