Sarayu : బోల్డ్ డైలాగులతో యూట్యూబ్ లో షేక్ చేస్తూ వచ్చిన ప్రముఖ యూట్యూబర్ , బిగ్ బాస్ ఫేం సరయు ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు 7 ఆర్ట్స్ కు చెందిన శ్రీకాంత్ రెడ్డి, కార్తీక్, కృష్ణ మోహన్ లను అదుపులోకి తీసుకున్నారు.
ఓ వర్గాన్ని కించ పరిచేలా, విద్వేషాలు రెచ్చగొట్టేలా ఓ యాడ్ లో నటించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే సరయు(Sarayu )పై కేసు నమోదు చేశారు. దీంతో కేసు ఆధారంగా హైదరాబాద్ లోని బంజారా హిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
దాదాపు గంటకు పైగా విచారణ చేసిన అనంతరం సరయుతో(Sarayu )పాటు ఆమె వీడియో టీం సభ్యులను కూడా అరెస్ట్ చేశారు. వారిని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇదిలా ఉండగా తాము పని చేస్తున్న 7 ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ కోసమని గత ఏడాది సరయు, టీం తమ యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియో ను అప్ లోడ్ చేశారు. ఇందులో సరయు నటించారు.
ఆమెతో పాటు అందులో నటించిన టీం సభ్యులు తలకు గణపతి బొప్పా మోరియా అని రాసి ఉన్న దానిని ధరించి, మద్యం సేవించినట్లు వీడియో ను రూపొందించారు.
దీంతో హిందూ సంస్థలు పెద్ద ఎత్తున అభ్యంతరం తెలిపాయి. వెంటనే ఆ అభ్యంతరకర వీడియోను తొలగించాలని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
వీహెచ్ పీ సిరిసిల్ల చీఫ్ అశోక్ ఫిర్యాదు మేరకే వారిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.
Also Read : అంతటా ‘లబ్ డబ్’ సాంగ్ సందడి