PT Usha : భారత దేశ క్రీడా రంగ చరిత్రలో పీటీ ఉషది చెరపలేని అధ్యాయం. ఆమె సాధించిన విజయం నేటికీ స్పూర్తి దాయకంగా ఉంటోంది. పరుగుల రాణిగా పేరొందింది.
27 జూన్ 1964లో కేరళలో పుట్టింది. ఆమె పూర్తి పేరు పిలావుళ్లకండి తెక్కేపఱంబిల్ ఉష. 1979 నుంచి భారత దేశం తరపున అథ్లెటిక్స్ లో పాల్గొంది. దేశానికి పలు పతకాలు సాధించి పెట్టింది.
1986లో ఆసియా క్రీడల్లో 4 బంగారు పతకాలు, ఒక రజిత పతకం సాధించింది. 1983 ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల్లో 2 రజిత పతకాలు, 1990లో జరిగిన ఆసియాడ్ లో 3 రజిత పతకాలు సాధించింది.
అంతే కాకుండా 1994లో జరిగిన ఆసియాడ్ పోటీల్లో ఒక రజిత పతకాన్ని పొందింది. 1984లో లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఒలింపిక్స్ లో 400 మీటర్ల హార్డిల్స్ పరుగు పందెంలో సెకన్ లో వందో వంతులో కాంస్య పతాకన్ని కోల్పోయింది.
కానీ ఒలింపిక్స్ అథ్లెటిక్స్ పోటీల్లో ఫైనల్స్ కు చేరిన మొట్ట మొదటి భారతీయ మహిళా అథ్లెట్ గా రికార్డు సృష్టించింది. దేశానికి గర్వ కారణంగా నిలిచిన పీటీ ఉషకు 1985లో ప్రభుత్వం పద్మశ్రీ, అర్జున అవార్డులతో సత్కరించింది.
ఇక కేంద్రంలోని నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ ఏకంగా అరుదైన గౌరవంతో సత్కరించింది పీటీ ఉషను(PT Usha). ఆమెను 6 జూలై 2022న రాజ్యసభ (పెద్దల సభ)కు నామినేట్ చేసింది.
ఈ సందర్భంగా భారత ప్రధాన మంత్రి పీటీ ఉషను ఆకాశానికి ఎత్తేశారు. వర్దమాన క్రీడాకారులకు ఆమె ఓ రోల్ మోడల్ అని పేర్కొన్నారు.
Also Read : అక్షరానికి పట్టం అరుదైన పురస్కారం