IND vs ENG 2nd T20 : ఇంగ్లండ్ తో సై అంటున్న టీమిండియా
తీవ్ర ఒత్తిడిలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ
IND vs ENG 2nd T20 : ఇంగ్లండ్ టూర్ లో భాగంగా రీ షెడ్యూల్ మ్యాచ్ లో ఘోర ఓటమిని చవి చూసిన భారత జట్టు ఎట్టకేలకు టీ20 సీరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ చేజిక్కించుకుంది. ఇక విజయం ఇచ్చిన స్పూర్తితో రెండో టీ20(IND vs ENG 2nd T20) మ్యాచ్ కు రెడీ అవుతోంది.
జాస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు మరింత దూకుడు పెంచాలని అనుకుంటోంది. ఇక విశ్రాంతి పేరుతో ఆడకుండా ఉన్న సీనియర్లు ఈ మ్యాచ్ లో ఆడేందుకు రెడీ అయ్యారు.
దీంతో మొదటి టి20 మ్యాచ్ లో ఆడిన ఆటగాళ్లను మార్చే చాన్స్ ఉంది. అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో సత్తా చాటాడు హార్దిక్ పాండ్యా. 51 పరుగులు చేసి 4 కీలక వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఇక మొదటి టి20 మ్యాచ్ కు దూరంగా ఉన్న కోహ్లీ, బుమ్రా, జడేజా, శ్రేయస్ అయ్యర్ టెస్టు జట్టుతో ఉన్న కారణంగా దూరంగా ఉన్నారు. తాజాగా వీరంతా అందుబాటులోకి వచ్చారు.
ఇక కరోనా కారణంగా క్వారంటైన్ లో ఉన్న రోహిత్ శర్మ తిరిగి వచ్చాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే నెంబర్ వన్ బ్యాటర్ గా పేరొందిన విరాట్ కోహ్లీ గత కొంత కాలంగా పేలవమైన ప్రదర్శనతో ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు.
అతడి స్థానం ఇప్పుడు డైలమాలో పడింది. కుర్రాళ్లు సీనియర్ల కంటే బాగా ఆడుతున్నారు. దీంతో ఎవరిని తప్పించాలనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ. మొత్తంగా కోహ్లీ పరిస్థితి ఉంటాడా ఉండడా అన్నది నెలకొంది.
Also Read : హార్దిక్ పాండ్యా వన్ మ్యాన్ షో