Sudarsan Pattnaik : షింజో అబేకు ప‌ట్నాయ‌క్ నివాళి

ఒడిశా ఒడ్డున సైక‌త శిల్పం

Sudarsan Pattnaik : జ‌పాన్ మాజీ ప్ర‌ధాన మంత్రి షింజో అబే కు మృతి చెంద‌డంతో యావ‌త్ ప్ర‌పంచం శోక సంద్రంలో మునిగి పోయింది. ఆయ‌న‌కు నివాళులు, సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక భార‌త దేశంలో గ‌ర్వించ ద‌గిన క‌ళాకారుడు సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్ మ‌రోసారి త‌న అభిమానాన్ని, గౌర‌వాన్ని చాటుకున్నారు. ఒడిశాలోని పూరి న‌ది ఒడ్డున ప‌ట్నాయ‌క్ మాజీ ప్ర‌ధాని షింజో అబేను కాల్చి వేయ‌డాన్ని త‌ట్టుకోలేక పోయాడు.

ఈ మేర‌కు ఇసుక‌తో పెద్ద ఎత్తున శైక‌త శిల్పాన్ని త‌యారు చేశాడు. ఈ సంద‌ర్భంగా షింజో అబే మీరు ఎప్ప‌టికీ మా హృద‌యాల్లో నిలిచే ఉంటార‌ని పేర్కొన్నాడు. ఆపై మిమ్న‌ల్ని కోల్పోవ‌డం బాధాక‌రం అంటూ ఆ శిల్పానికి చేర్చాడు సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్(Sudarsan Pattnaik).

ప్ర‌స్తుతం ఆయ‌న త‌యారు చేసిన ఈ సైక‌త శిల్పం (పూర్తిగా ఇసుకతో త‌యారు చేసింది ) సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ప్ర‌పంచ వ్యాప్తంగా పట్నాయ‌క్ ను అభినందిస్తున్నారు.

ఓ వైపు నైరుతి రుతు ప‌వ‌నాల ప్ర‌భావంతో దేశ వ్యాప్తంగా ఎడ తెరిపి లేకుండా వ‌ర్షాలు కురుస్తున్నాయి. అయినా పూరీ న‌ది ఒడ్డున ఎంతో క‌ష్ట‌ప‌డి దేశం గ‌ర్వించేలా సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్ రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి సైక‌త శిల్పాన్ని త‌యారు చేశాడు.

ప్ర‌స్తుతం బీచ్ కు వ‌చ్చే సంద‌ర్శ‌కులు షింజే అబేకు నివాళులు అర్పిస్తున్నారు. యావ‌త్ భార‌త దేశం ఇవాళ షింజే అబేకు నివాళులు అర్పిస్తోంది.

భార‌త దేశంతో చివ‌రి దాకా షింజో స‌త్ సంబంధాలు క‌లిగి ఉండేందుకు ప్ర‌యారిటీ ఇచ్చారు. కానీ చైనాకు మాత్రం చుక్క‌లు చూపించాడు ఈ మాజీ ప్ర‌ధాన మంత్రి.

Also Read : ప్ర‌ధాని భావోద్వేగం రేపు సంతాప దినం

Leave A Reply

Your Email Id will not be published!