Sangakkara : లంక భవిష్యత్తు కోసం పోరాటం – సంగక్కర
రాజపక్సే రాజీనామా చేయాల్సిందే
Sangakkara : శ్రీలంకలో ఇంకా సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అధ్యక్ష భవనం ముట్టడించారు ఆందోళనకారులు. ఆర్థిక, ఆహార, ఆయిల్ సంక్షోభం మధ్య జనం రోడ్డెక్కారు. లక్షలాదిగా తరలి వచ్చారు.
ప్రధానంగా దేశంలో కొనసాగుతున్న ప్రజల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ శ్రీలంక మాజీ క్రికెటర్లు పూర్తి మద్దతు ప్రకటించారు.
ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన స్టార్ మాజీ ఓపెనర్ సనత్ జయసూర్య ఏకంగా ఆందోళనకారులతో కలిసి పాల్గొన్నాడు. తన దేశం జెండాను పట్టుకుని నినాదాలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక జయసూర్యకు మద్దతు ప్రకటించారు మాజీ క్రికెటర్లు, కెప్టెన్లు అర్జున రణతుంగ, మహేళ జయవర్దనే, కుమార సంగక్కర(Sangakkara).
ఈ ఆందోళన, నిరసన తమ దేశం భవిష్యత్తు కోసం కొనసాగుతున్నదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తమ బ్రదర్ జయసూర్యకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదే సమయంలో సనత్ జయసూర్య దేశ అధ్యక్షుడు గోటబోయ రాజపక్సే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు. తాము కూడా ఆయన డిమాండ్ కు అనుగుణంగానే కోరుతున్నామని పేర్కొన్నారు.
పాలకులు తమ స్వంత లాభం చూసుకుంటే ఇలాగే ఉంటుందని హెచ్చరించాడు కుమార సంగక్కర. ప్రస్తుతం ఆయనతో పాటు రోషన్ మహనామా కూడా జత కట్టాడు.
ఆకలితో ఉన్న ప్రజలకు బ్రెడ్లు, టీలు సరఫరా చేస్తున్నాడు తానే స్వయంగా. వైరల్ గా మారింది. ఈ ఆందోళనల్లో ఎలాంటి దురుద్దేశం లేదని పేర్కొన్నాడు మరో మాజీ క్రికెటర్ మహేళ జయవర్దనే.
Also Read : భారత బౌలర్లు భళా ఇంగ్లండ్ డీలా