Sri Lanka Protests : శ్రీలంక..ఆసిస్ టెస్ట్ లో నినాదాలు
రాజపక్సేకు వ్యతిరేకంగా ఫ్యాన్స్ ఫైర్
Sri Lanka Protests : ఓ వైపు శ్రీలంకలో సంక్షోభం నెలకొంది. మరో వైపు ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకతో టెస్టు మ్యాచ్ ఆడుతోంది. ఈ తరుణంలో తీవ్ర భద్రత నడుమ ఆడుతున్నారు ఇరు జట్ల ఆటగాళ్లు.
మ్యాచ్ చూసేందుకు వచ్చిన క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున దేశ అధ్యక్షుడు గోటబోయ రాజపక్సేకు వ్యతిరేకంగా నినాదాలు(Sri Lanka Protests) చేశారు. ఆపై గాలె కోట గోడలు ఎక్కి తమ జాతీయ జెండాలతో నిరసన తెలిపారు.
ఆపై పెద్ద ఎత్తున దిగి పోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ తరుణంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నారు ఆసిస్ ఆటగాళ్లు. టెస్టు సీరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా శ్రీలంకతో గాలే స్టేడియంలో రెండో టెస్టు మ్యాచ్ ఆడుతోంది.
ఉదయం సెషన్ లో వందలాది మంది నిల్చున్నారు. ప్రెసిడెంట్ దిగిపో అంటూ నినదించారు. ఓ వైపు జాతీయ పతాకాలు మరో వైపు నిరసనకారుల నినాదాలతో క్రికెట్ స్టేడియం ప్రాంగణం దద్దరిల్లింది.
ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీలంక ఆర్మీ రంగం లోకి దిగింది. దీంతో టెస్టు సజావుగా సాగింది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా క్రికెటర్లకు రక్షణ కల్పించారు.
స్టేడియం చుట్టూ క్రికెట్ ఫ్యాన్స్ నిలబడడంతో కొంచెం ఇబ్బందికి లోనయ్యారు. అధ్యక్షుడిని తన అధికారిక నివాసం నుండి పారిపోయేందుకు రెండు గంటల ముందు ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఇవాళ దేశం అల్లకల్లోలంగా ఉంది. వారి అభిప్రాయాన్ని వినగలిగామన్నారు ఆసిస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్. కాగా రెండో టెస్టులో 145 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. ఈ ఆందోళన తమ ఆటపై ఎలాంటి ప్రభావం చూపలేదని పేర్కొన్నాడు.
Also Read : లంక భవిష్యత్తు కోసం పోరాటం – సంగక్కర
Live from Galle, Massive protest outside stadium where SLvsAus 2nd test match ongoing #SriLanka #SriLankaCrisis #SriLankaEconomicCrisis #SLvsAUS #Galle #gotabayarajapaksa #SriLankaprotest pic.twitter.com/yzRZgVai7M
— gelos.in (@gelos_in) July 9, 2022