Rohit Sharma Kohli : కోహ్లీ ఫామ్ పై రోహిత్ శర్మ కామెంట్స్
విమర్శలు పట్టించుకోమన్న కెప్టెన్
Rohit Sharma Kohli : ఇంగ్లండ్ టూర్ లో జరిగిన టీ20 సీరీస్ లో భారత జట్టు 2-1 తేడాతో సీరీస్ కైవసం చేసుకుంది. ఇప్పటికే రీ షెడ్యూల్ 5వ టెస్టులో 7 వికెట్ల తేడాతో ఘోరంగా ఓటమి పాలైంది.
పరువు పోకుండా కాపాడుకుంది. ఇదిలా ఉండగా భారత జట్టు మాజీ కెప్టెన్, టాప్ ప్లేయర్ గా పేరొందిన విరాట్ కోహ్లీ(Virat Kohli) గత కొంత కాలం నుంచి ఫామ్ కోల్పోయాడు.
రెండు ఏళ్లుగా పట్టుమని ఒక్క సెంచరీ కూడా చేయలేక పోయాడు. కనీసం 50 పరుగులు చేసేందుకు నానా తంటాలు పడుతున్నాడు. ప్రధానంగా బౌలర్లను ఎదుర్కోలేక ఇబ్బంది పడుతున్నాడు.
ఈ తరుణంలో ఇంగ్లండ్ తో జరిగిన మూడు టీ20 మ్యాచ్ లలో విరాట్ కోహ్లీ చేసిన పరుగులు 20 పరుగులు కూడా లేవు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా తో పాటు భారత జట్టు మాజీ క్రికెటర్లు సైతం నిప్పులు చెరుగుతున్నారు.
విరాట్ కోహ్లీ ఇప్పటికైనా ఆటపై ఫోకస్ పెట్టాలని సూచించారు. కొంత కాలం పాటు రెస్ట్ తీసుకోవడం మంచిదని హితవు పలికారు. ఈ సందర్భంగా మూడో టి20 మ్యాచ్ లో ఓటమి పాలైన తర్వాత మీడియాతో మాట్లాడాడు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma Kohli).
బయట ఉన్న నిపుణులు, మేధావులు, అనలిస్టులు ఎవరో తనకు తెలియదని అన్నాడు. బయట కనిపించేది వేరు లోపటల నడిచేది వేరుగా ఉందన్నారు. విరాట్ కోహ్లీకి సంపూర్ణ మద్దతు ప్రకటించాడు.
తమకు ఓ ప్లాన్ ఉందని, దాని ప్రకారం తాము వెళుతున్నామని స్పష్టం చేశాడు. ఒక్కోసారి ఫామ్ ఉంటుంది ఇంకో సారి ఫామ్ ఉండదన్నాడు. ఆ దిశగా కోహ్లీ అద్భుతమైన ప్లేయర్ అని పేర్కొన్నాడు.
Also Read : సూర్య సెంచరీ చేసినా తప్పని ఓటమి