AIADMK EPS New Boss : అన్నాడీఎంకేకు అతడే సారథి
పన్నీర్ పై పళని స్వామి పై చేయి
AIADMK EPS New Boss : తమిళనాడు రాజకీయాలలో ఉత్కంఠ రేపుతూ వచ్చిన అన్నాడీఎంకేకు (AIADMK EPS New Boss) సారథి ఎవరు అనే దానిపై క్లారిటీ వచ్చేసింది. నిన్నటి దాకా మిత్రులుగా ఉన్న మాజీ సీఎం ఎడాప్పాడి పళని స్వామి, మాజీ డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూ వచ్చింది కొంత కాలంగా.
చివరకు నువ్వా నేనా అనే స్థాయికి చేరింది. ఇరు నాయకులకు చెందిన మద్దతు దారులు దాడులకు దిగేంత దాకా వెళ్లింది. ఈ సమయంలో పన్నీర్ సెల్వం పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం నిలుపుదల చేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై కీలక తీర్పు సోమవారం వెలువరించింది. అనంతరం సజావుగా పార్టీ కీలక సమావేశం జరిగింది. ఇందులో అన్ని పదవుల నుంచి పన్నీర్ సెల్వంను తొలగిస్తూ కోలుకోలేని షాక్ ఇచ్చారు ఎడాప్పాడి పళని స్వామి.
మొత్తం పార్టీనంతా తన చెప్పు చేతుల్లోకి తీసుకున్నారు. మొత్తం 2,500 మంది సభ్యులు కలిగిన అన్నాడీఎంకేలో ఇప్పుడు తనే ఏకైక నాయకుడిగా చెలామణి కానున్నాడు.
గతంలో దివంగత జయలలిత సీఎంగా ఉన్న సమయంలో పన్నీర్ సెల్వంకు ప్రయారిటీ ఉండేది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల
నేపథ్యంలో వీకే శశికళ అనూహ్యంగా జైలుకు వెళ్లింది.
నాలుగు సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించి తిరిగి వచ్చింది. గత ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించింది. హల్ చల్ చేసింది. చివరకు
ఏమైందో కానీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది.
తర్వాత మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. ఆమెకు సంబంధం లేదంటూ ప్రకటించారు ఈపీఎస్. అయితే ఓపీఎస్ ఆమెకు మద్దతు పలకడంతో ఇద్దరి
మధ్య పోటీ నెలకొంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడంటూ పన్నీర్ సెల్వంను బహిష్కరించారు పార్టీ నుంచి .
ఈ సందర్భంగా తన బహిష్కరణపై స్పందించారు ఓపీఎస్ . తనను 1.5 కోట్ల మంది పార్టీ కార్యకర్తలు కో ఆర్డినేటర్ గా ఎన్నుకున్నారని తెలిపారు.
తనను తొలగించే హక్కు ఈపీఎస్ కు లేదన్నారు .
తన తొలగింపుపై సవాల్ చేస్తూ కోర్టుకు మరోసారి వెళతానని పన్నీర్ సెల్వం ప్రకటించారు. ఇక ఎడప్పాడి పళని స్వామి వేసిన స్కెచ్ లో
ఇద్దరూ బలై పోయారని చెప్పక తప్పదు.
ఆ ఇద్దరిలో ఒకరు ఓపీఎస్ కాగా మరొకరు వీకే శశికళ. కోర్టును ఆశ్రయించినా ఫలితం ఉండదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఏది ఏమైనా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన అన్నాడీఎంకే ఇప్పుడు పదవి కోసం పాకులడటంపై అభిమానులు మాత్రం జీర్ణించు కోలేక పోతున్నారు.
Also Read : అన్నాడీఎంకేకు ఈపీఎస్ బాస్