Sri Lanka Army Chief : ప్రజల ఆస్తులను ధ్వంసం చేయొద్దు
కఠిన చర్యలు తీసుకుంటామన్న ఆర్మీ చీఫ్
Sri Lanka Army Chief : శ్రీలంకలో సంక్షోభం మరింత ఉగ్రరూపం దాల్చింది. ఈ తరుణంలో తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధానమంత్రి రణిలే విక్రమ సింఘే వ్యవహరిస్తున్నారు.
ఆయనతో పాటు గోటబయ రాజపక్సే రాజీనామా చేయాలంటూ గత కొంత కాలం నుంచీ డిమాండ్ చేస్తూ వస్తున్నారు లంకేయులు. ఇదే సమయంలో ఆర్మీని కూడా లెక్క చేయడం లేదు.
ఇప్పటికే ప్రెసిడెంట్ రాజభవనంలోకి ప్రవేశించారు. విక్రమ సింఘే ఇంటికి నిప్పు పెట్టారు. ఆయనకు చెందిన వాహనాలను ధ్వంసం చేశారు. ఇదే సమయంలో పీఎం ఆఫీసు లోకి ప్రవేశించారు.
ఆపై శ్రీలంక దేశానికి చెందిన జాతీయ జెండాలను ఎగుర వేశారు. ఇదంతా పక్కన పెడితే శ్రీలంక ఆర్మీ చీఫ్(Sri Lanka Army Chief) సెల్వ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల, దేశానికి సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేయొద్దని కోరారు.
సంయమనంతో వ్యవహరించాలని, పరిస్థితి చేయి దాటితే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఇదే సమయంలో ఆస్తి, ప్రాణ నష్టాన్ని ఆపేందుకు బలవంతంగా ఉపయోగించుకునే అధికారం సైనికులకు ఉందని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు శ్రీలంక సైన్యం కొలంబో వీధుల్లో సాయుధ వాహనాలను మోహరించింది.
ఈ మేరకు సాయుధ దళాలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. నిరసనకారులపై బల ప్రయోగం చేయాలన్న రణిలే ఆదేశాలను సైనిక వ్యవస్థ తిరస్కరించింది. సాధ్యమైనంత వరకు సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్మీ చీఫ్ కోరారు.
హింస ఎన్నటికీ ఆమోద యోగ్యం కాదన్నారు శైవేంద్ర సెల్వ. ఆందోళనకారులకు నచ్చ చెప్పాలని ఎలాంటి దాడులకు పాల్పడ వద్దని సూచించారు.
Also Read : సింగపూర్ కు గోటబయ రాజపక్సే పరార్