Daler Mehndi : దలేర్ మెహందీకి 2 ఏళ్ల జైలు శిక్ష..జరిమానా
మానవ అక్రమ రవాణా కేసు పర్యవసానం
Daler Mehndi : ప్రముఖ పాప్ పంజాబ్ సింగర్ దలేర్ మెహందీకి కోలుకోలేని షాక్ తగిలింది. మానవ అక్రమ రవాణా కేసులో పాటియాలా కోర్టు గురువారం సంచలన తీర్పు చెప్పింది.
కోర్టు దలేర్ మెహందీకి(Daler Mehndi) 2 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీంతో గాయకుడిని జైలుకు పంపారు. 2017లో బల్బేరా గ్రామానికి చెందిన బక్షిష్ సింగ్ దాఖలు చేసిన ఫిర్యాదుపై పాటియాలా పోలీసులు కేసు నమోదు చేశారు.
అతడిని కెనడాకు పంపించేందుకు దలేర్ మెహందీ సోదరులు రూ. 12 లక్షలు తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా మరో 35 ఫిర్యాదులు వచ్చాయి.
విచిత్రం ఏమిటంటే ఒకరిని కొట్టి చంపిన కేసులో భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్, ప్రయోక్త, పంజాబ్ కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ నవ జ్యోత్ సింగ్ సిద్దూ కూడా పాటియాలా జైలులో ఉన్నారు.
ఇక క్రికెటర్ తో పాటు దలేర్ మెహందీ కూడా చేరడం విశేషం. 2003లో మానవ అక్రమ రవాణా కేసులో 2018లో పాప్ సింగర్ దలేర్ మెహందీకి శిక్ష పడింది. దీనిని సవాల్ చేస్తూ కోర్టుకు ఎక్కారు సింగర్.
ఈ జైలు శిక్షను పాటియాలా జిల్లా కోర్టు గురువారం సమర్థించింది. అడిషనల్ డిస్ట్రిక్ట్ , సెషన్ జడ్జి హెచ్ ఎస్ గ్రేవాల్ శిక్షకు వ్యతిరేకంగా గాయకుడు చేసిన అప్పీల్ ను తోసి పుచ్చారు.
ఐపీసీ సెక్షన్ 420 , 120 బి దలేర్ మెహందీని(Daler Mehndi) దోషిగా నిర్దారించింది. దిగువ కోర్టు నిర్ణయాన్ని సమర్థించారు. ట్రయల్ కోర్టు 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 2 వేల జరిమానా విధించింది.
Also Read : జుబైర్ ట్వీట్లతో ఎంత మంది బాధ పడ్డారు