IND vs ENG 2nd ODI : ఇంగ్లండ్ భళా ఇండియా విలవిల
100 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు విక్టరీ
IND vs ENG 2nd ODI : అనుకున్నట్టుగానే తనకు అచ్చొచ్చిన లార్డ్స్ మైదానంలో ఆతిథ్య జట్టు దుమ్ము రేపింది. ఏకంగా భారత్ తో జరిగిన రెండో వన్డే మ్యాచ్(IND vs ENG 2nd ODI) లో 100 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.
టి20 సీరీస్ 2-1 తేడాతో చేజిక్కించుకుని తొలి వన్డేలో సత్తా చాటిన టీమిండియాకు ఇంగ్లండ్ చుక్కలు చూపించింది. ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు భారత బ్యాటర్లు విలవిలలాడారు.
మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 49 ఓవర్లలో 246 పరుగులు చేసి ఆలౌటైంది. మొయిన్ అలీ 2 ఫోర్లు 2 సిక్స్ లతో 47 పరుగులు చేస్తే విల్లీ 49 బంతుల్లో 41 రన్స్ చేశాడు.
ఇందులో 2 ఫోర్లు 2 సిక్స్ లు ఉన్నాయి. స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మరోసారి తన బంతితో మ్యాజిక్ చేశాడు.ఏకంగా 47 పరుగులు ఇచ్చి
4 వికెట్లు తీశాడు.
బుమ్రా , హార్దిక్ పాండ్యా చెరో 2 వికెట్లు తీశాడు. అనంతరం బరిలోకి దిగిన భారత జట్టు భారీ టార్గెట్ ను ఛేదించ లేక చేతులెత్తేసింది. 38.5 ఓవర్లలో 146 పరుగలకే చాప చుట్టేసింది.
రవీంద్ర జడేజా 29 పరుగులు చేస్తే పాండ్యా మరో 29 రన్స్ చేసి పరువు పోకుండా కాపాడారు. ఇక ఆతిథ్య జట్టులో రీస్ టాప్లీ టాప్ లేపాడు. ఏకంగా
6 వికెట్లు తీశాడు.
టీమిండియా నడ్డి విరిచాడు. మరో వైపు గాయం కారణంగా మొదటి వన్డే కు దూరమైన కోహ్లీ రెండో వన్డేలో ఆడాడు. దీంతో అతడి కోసం
శ్రేయస్ అయ్యర్ ను తప్పించారు.
టాప్లీ దెబ్బకు రోహిత్ డకౌట్ అయితే ధావన్ 9 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. పంత్ సున్నాకే అవుట్ అయ్యాడు. కోహ్లి 16 రన్స్ లో
ఉండగా విల్లీ దెబ్బ కొట్టాడు. సూర్య కుమార్ 27 రన్స్ చేశాడు.
Also Read : చోటు కోసం రన్ మెషీన్ తండ్లాట