UP Teacher Farewell : టీచ‌ర్ కోసం స్టూడెంట్స్ కంట‌త‌డి

నెట్టింట్లో వీడియో వైర‌ల్ ..హ‌ల్ చ‌ల్

UP Teacher Farewell : ప్ర‌పంచంలో గురువుల‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఏ దేశంలోనైనా టీచ‌ర్ల‌దే ప్ర‌ముఖ స్థానం. వాళ్ల చేతుల్లోనే పిల్ల‌ల భ‌విష్య‌త్తు ఆధార ప‌డి ఉంద‌న్న‌ది వాస్త‌వం.

ఈ దేశానికి రాష్ట్ర‌ప‌తిగా స‌ర్వే ప‌ల్లి రాధాకృష్ణ‌న్ ఉన్నారు. ఆయ‌న కూడా ఒక‌ప్పుడు టీచ‌ర్ గా ప‌ని చేసిన వారే. పిల్ల‌ల‌కు నిబ‌ద్ద‌త‌తో పాఠాలు చెబుతూ వారిని అద్భుత‌మైన భావి భార‌త పౌరులుగా తీర్చిదిద్దుతున్న వారెంద‌రో ఉన్నారు ఈ కంట్రీలో. నైపుణ్యాలు నేర్పిస్తూ త‌మ‌ను తాము ఆద‌ర్శ ప్రాయంగా మారిన పంతుళ్లు కూడా లేక పోలేదు.

ఇదే స‌మ‌యంలో కొంద‌రు పాఠాలు చెప్పకుండా డుమ్మాలు కొట్టే వారు లేక పోలేదు. స‌మాజం అన్నాక మంచి చెడు ఉంటాయి. తాజాగా ఓ టీచ‌ర్ పిల్ల‌ల‌కు తండ్రిగా మారారు.

వారికి పాఠాలు బోధిస్తూ వారిలో ఒక‌డిగా క‌లిసి పోయాడు. ఇదే సంద‌ర్భంలో స‌ద‌రు టీచ‌ర్ శివేంద్ర సింగ్ కి (UP Teacher Farewell) బదిలీ అయ్యింది. దీంతో ఏర్పాటు చేసిన వీడ్కోలు స‌మావేశంలో ఆస‌క్తిక‌ర‌మైన స‌న్నివేశం చోటు చేసుకుంది.

ఆ టీచ‌ర్ త‌మ‌కు కావాలంటూ విద్యార్థులు ప‌ట్టుబ‌ట్టారు. అత‌డిని వెళ్ల‌నీయ‌కుండా అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున కంట త‌డి పెట్టారు. అత‌డి అసాధార‌ణ‌మైన బోధ‌న, విద్యార్థుల‌కు మ‌రింత ఆస‌క్తిని క‌లిగించే ప‌ద్ద‌తుల ద్వారా విప‌రీత‌మైన ప్ర‌జాద‌ర‌ణ పొందారు ఈ టీచ‌ర్.

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ రాష్ట్రంలోని రాయ్ గ‌ఢ్ ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో నాలుగేళ్ల త‌ర్వాత శివేంద్ర సింగ్ ఇటీవ‌ల బ‌దిలీ అయ్యారు. ఈ వీడ్కోలు కార్య‌క్ర‌మానికి సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది.

ఇలాంటి టీచ‌ర్లు తెలంగాణ బ‌డుల్లో ఉండాల‌ని కోరుకుంటున్నారు పేరెంట్స్.

Also Read : ఐఐటీ మ‌ద్రాస్..ఐఐఎస్ బెంగ‌ళూరు టాప్

Leave A Reply

Your Email Id will not be published!