Babar Azam : విరాట్ కోహ్లీ గ్రేట్ ప్లేయ‌ర్ – బాబ‌ర్ ఆజ‌మ్

అత‌డినే స్పూర్తిగా తీసుకుని ఆడుతున్నా

Babar Azam : ఓ వైపు భార‌త క్రికెట్ జ‌ట్టు తాజా, మాజీ ఆట‌గాళ్లు స్టార్ క్రికెట‌ర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఫామ్ పై నిప్పులు చెరుగుతున్నారు. భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ నిఖంజ్ అయితే ఏకంగా కోహ్లీని ఎందుకు పెట్టుకున్నారంటూ ప్ర‌శ్నించాడు బీసీసీఐ సెలెక్ట‌ర్ల‌ను.

వెంట‌నే అత‌డిని తీసేసి యువత‌రం ఆటగాళ్ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని సూచించాడు. ప్ర‌స్తుతం క‌పిల్ దేవ్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. ఇదే స‌మ‌యంలో ఇంగ్లండ్ టూర్ లో ఉన్న కోహ్లీ ప‌రుగులు చేసేందుకు నానా తంటాలు ప‌డుతున్నాడు.

వ‌రుస‌గా బ్యాటింగ్ లో విఫ‌ల‌మ‌వుతూ వ‌స్తున్నాడు. దీంతో అత‌డి ఆట తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌తాయి. గ‌త కొంత కాలం నుంచీ విరాట్ కోహ్లీ ఖాతాలో ఒక్క సెంచ‌రీ కూడా లేక పోవ‌డం విశేషం.

ఇదే స‌మ‌యంలో ఇంగ్లండ్ టూర్ లో సైతం తీవ్ర నిరాశ ప‌రిచాడు. కాగా బీసీసీఐ ఊహించ‌ని రీతిలో విండీస్ లో ప‌ర్య‌టించే భారత జ‌ట్టులో ఎంపిక చేయ‌లేదు కోహ్లీని.

దీంతో ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జ‌రిగే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో చోటు ఉంటుందో లేదోన‌న్న ఆందోళ‌న వ్య‌క్త‌మైంది కోహ్లీ అభిమానుల్లో. ఈ త‌రుణంలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు పాకిస్తాన్ జ‌ట్టు కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్(Babar Azam).

కోహ్లీని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తాడు. తాను కూడా విరాట్ కోహ్లీని చూసి ఆట తీరు మార్చుకున్న‌ట్లు తెలిపాడు. ప్ర‌స్తుతం బాబ‌ర్ ఆజ‌మ్ చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

Also Read : కోహ్లీపై ఎందుకీ చ‌ర్చ‌..ర‌చ్చ – రోహిత్

Leave A Reply

Your Email Id will not be published!