Saudi Prince MBC : ఖషోగ్గీ హత్యోదంతం యువరాజు దరహాసం
సోషల్ మీడియాలో వీడియో వైరల్
Saudi Prince MBC : ప్రపంచ వ్యాప్తంగా 2018లో జర్నలిస్ట్ ఖషోగ్గీ జరిగిన హత్య సంచలనం కలిగించింది. జమాల్ ఖషోగ్గీ టర్కీకి చెందిన ప్రేయసి తీవ్ర అభ్యంతరం తెలిపింది.
ఇదిలా ఉండగా సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీసీ )(Saudi Prince MBC) కిరాతకుడే కాదు పూర్తి శాడిస్టు అంటూ సంచలన ఆరోపణలు చేసింది.
ఇదే సమయంలో అరబ్ దేశంలో పర్యటిస్తున్న అమెరికా దేశ అధ్యక్షుడు జో బైడెన్ ను తీవ్రంగా తప్పు పట్టింది. సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఈ తరుణంలో ఇంటర్నేషల్ మీడియా సమావేశం జరిగింది. పాల్గొన్న సౌదీ ప్రిన్స్ ను ప్రశ్నల వర్షం కురిపించారు జర్నలిస్టులు. వాళ్లు అడిగిన ఒకే ఒక్క ప్రశ్న ఏమిటంటే హత్యకు గురైన ఖషోగ్గీ కుటుంబానికి ప్రిన్స్ క్షమాపణలు చెబుతారా అని.
ఈ ప్రెస్ మీట్ లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో పాటు సౌదీ యువరాజా కూడా పాల్గొన్నారు. తీవ్రమైన ఇబ్బంది ఎదురవుతుందని అంతా అనుకున్నారు. కానీ తీరా ప్రిన్స్ మాత్రం నవ్వుతూ దాట వేశారు.
ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హల్ చల్ చేస్తోంది. ప్రధానంగా ఖషోగ్గీ హత్యకు సంబంధించిన ప్రశ్నను లేవదీశారు ఎన్బీసీ రిపోర్టర్ అలెగ్జాండర్.
దీంతో ప్రిన్స్ నవ్వడం కలకలం రేపింది. అంతర్జాతీయ మీడియా దీనిని హైలెట్ చేసింది. ఇదిలా ఉండగా ఖషోగ్గీ హత్య వెనుక ప్రిన్స్ ఉన్నాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. సౌదీ దారుణాల వెనుక ప్రిన్స్ హస్తం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read : రక్తంతో తడిసిన చేతులతో కరచాలనమా
At the end of a meeting between President Biden and Crown Prince Mohammed bin Salman of Saudi Arabia, an NBC News reporter, Peter Alexander, shouted “Jamal Khashoggi, will you apologize to his family?” Prince Mohammed and Biden ignored the question. https://t.co/aJWzG21P9T pic.twitter.com/PDyfPSwN1n
— The New York Times (@nytimes) July 15, 2022