Bihar : గవర్నమెంట్ ఉద్యోగులు రెండో పెళ్ళికి అనుమతి తప్పనిసరి

నోటిఫికేషన్‌ను జారీ

Bihar : బీహార్‌లో (Bihar) ఇకపై గవర్నమెంట్ ఎంప్లాయీస్ రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. ఈ మేరకు ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

 దీని ప్రకారం రెండో సారి పెళ్లి చేసుకోవాలనుకునే బీహార్ ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా వారి సంబంధిత విభాగాలకు తెలియజేయాలి. అవసరమైన అనుమతి పొందిన తర్వాత మాత్రమే వివాహం చేసుకోవాలి.

అంతేకాదు రెండో పెళ్లికి సిద్ధపడే ఉద్యోగులు ముందుగా అతని లేదా ఆమె జీవిత భాగస్వామి నుంచి చట్టబద్ధంగా విడిపోయి ఉండాలి. ఆ విషయాన్ని సంబంధిత విభాగానికి తెలియజేయాలి.

ఒక వేళ లీగల్‌గా విడాకులు తీసుకోకపోయినా.. మొదటి జీవిత భాగస్వామికి అభ్యంతరం ఉన్నా రెండో పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఈ నిబంధన మగ ఉద్యోగులకు, మహిళా ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది.

అంతేకాదు లీగల్‌గా విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకున్నా.. ప్రభుత్వ అనుమతి లేకుండా చేసుకున్నా, మొదటి జీవిత భాగస్వామి నుంచి అభ్యంతరం వ్యక్తం చేసినా ఉద్యోగి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సదుపాయాలు అందవు.

సంబంధిత శాఖ నుంచి అనుమతి తీసుకోకుండా ప్రభుత్వ ఉద్యోగి రెండో పెళ్లి (Govt Employees Remarry) చేసుకుని సర్వీసు కాలంలో మరణిస్తే అతని రెండో భార్య లేదా భర్త పిల్లలకు కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండదు.

ఇందులో మొదటి భార్య పిల్లలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది. ఇవన్నీ పొందాలంటే కచ్చితంగా అనుమతి పొందే రెండో పెళ్లి చేసుకోవాలి.

ఈ నిబంధనలను అన్ని డివిజనల్ కమిషనర్లు, జిల్లా మెజిస్ట్రేట్‌లు, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్‌లు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డీజీపీ హోంగార్డు, డీజీపీ జైలు, సంబంధిత ప్రతి అధికారిని తమ తమ అధికార పరిధిలో అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Also Read : త్వ‌ర‌లోనే గిరిజ‌న యూనివ‌ర్శిటీకి మోక్షం

Leave A Reply

Your Email Id will not be published!