Margaret Alva : మార్గరెట్ అల్వా నామినేషన్ దాఖలు
హాజరైన రాహుల్ గాంధీ, శరద్ పవార్
Margaret Alva : భారతదేశపు రెండో అత్యున్నత పదవిగా భావించే ఉప రాష్ట్రపతి పదవి కోసం 19న నామినేషన్ దాఖలు చేశారు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా. అధికారికంగా ప్రతిపక్ష నామినీగా వైస్ ప్రెసిడెంట్ రేసులో చేరారు.
రాజస్తాన్ మాజీ గవర్నర్ , కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ఎన్సీపీకి చెందిన శరద్ పవార్ , వామపక్ష నాయకత్వంతో కలిసి ఆగస్టు 6న పోటీకి పత్రాలను దాఖలు చేశారు.
సీపీఎం నేత సీతారాం ఏచూరి తో పాటు ప్రతిపక్ష నేతలు కూడా హాజరయ్యారు. రాజస్థాన్ , ఇతర రాష్ట్రాల మాజీ గవర్నర్ గా పని చేసి మార్గరెట్ అల్వా(Margaret Alva) ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు.
ఆమె విద్యార్థి దశలో ఉన్న సమయంలోనే ఎన్నో పోరాటాలలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో మార్గరెట్ అల్వా కీలకమైన నాయకురాలిగా ఎదిగారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఉన్న జగదీప్ ధన్ ఖర్ తన పదవికి రాజీనామా చేశారు.
భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ ఉమ్మడి అభ్యర్థిగా ధన్ ఖర్ ఉప రాష్ట్రపతి గా నామినేషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు భారత రాష్ట్రపతి గా ఉన్న వెంకయ్య నాయుడు పదవీ కాలం పూర్తయింది.
వచ్చే ఆగస్టు 10తో పదవీ కాలం ముగియనుంది. కాగా నాయుడికి ప్రమోషన్ దక్కుతుందని అంతా భావించారు. కానీ ఊహించని రీతిలో భారతీయ జనతా పార్టీ కోలుకోలేని షాక్ ఇచ్చింది. వెంకయ్య నాయుడికి ఈసారి పదోన్నతి కల్పించ లేదు.
Also Read : ఎన్నిక ముగిసింది ఫలితమే మిగిలింది