Avinash Das : అమిత్ షా ఫోటో షేర్ నిర్మాత ‘దాస్’ అరెస్ట్
అరెస్టయిన బ్యూరోక్రాట్ తో షా ఫోటో షేర్
Avinash Das : అరెస్ట్ అయిన బ్యూరోక్రాట్ తో అమిత్ షా ఫోటో షేర్ చేసినందుకు గాను ప్రముఖ సినీ నిర్మాత అవినాష్ దాస్ అరెస్ట్ అయ్యారు. ఫోటో ఫిల్మ్ మేకర్ అవినాస్ దాస్ కు ఇచ్చిన క్యాప్షన్ లో ఐఏఎస్ అధికారిని అరెస్ట్ చేసేందుకు కొన్ని రోజుల ముందు తీసిన చిత్రం అని పేర్కొంది.
ఇదిలా ఉండగా 2017లో వచ్చిన అనార్కలి ఆఫ్ ఆరా చిత్రానికి దర్శకత్వం వహించారు. కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా అరెస్ట్ అయిన ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్ తో దిగిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసిన కేసులో గుజరాత్ పోలీసులు మంగళవారం ముంబైకి చెందిన సినీ నిర్మాత అవినాష్ దాస్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
తదుపరి చర్య కోసం అతన్ని అహ్మదాబాద్ కు తీసుకు వస్తున్నట్లు వెల్లడించారు. ఇవాళ ముంబై నుండి అవినాష్ దాస్(Avinash Das) ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
తదుపరి చట్ట పరమైన ప్రక్రియ కోసం తమ బృందం అహ్మదాబాద్ కు తీసుకు వస్తోందన్నారు సిటీ క్రైమ్ బ్రాంచ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డి.పి. చుడసమా తెలిపారు.
చిత్ర నిర్మాతపై భారతీయ శిక్షా స్మృతి లోని సెక్షన్ 469 (ఫోర్జరీ) , అలాగే జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని రూల్స్ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు.
ఇన్ స్టా గ్రామ్ , ఫేస్ బుక్ ఖాతాలలో ఒక మహిళ జాతీయ జెండాను ధరించిన మరో ఫోటోను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.
Also Read : నూపుర్ శర్మకు సుప్రీంకోర్టు ఊరట