Rahul Shewale : ఎన్డీఏలో చేరాలనుకున్న ఉద్ధవ్ ఠాక్రే
శివసేన రెబల్స్ సంచలన కామెంట్స్
Rahul Shewale : మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చి వేసి భారతీయ జనతా పార్టీతో సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేసిన సీఎం ఏక్ నాథ్ షిండే శివసేన రెబల్ వర్గం సంచలన కామెంట్స్ చేసింది.
గతంలో భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో ఠాక్రే చేరాలని అనుకున్నట్లు బాంబు పేల్చారు. ఇదే సమయంలో ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) తిరుగుబాటుతో ఓడి పోయిన మరాఠా మాజీ సీఎం గతేడాది ఎన్డీఏలో చేరాలని అకున్నారని షిండే శిబిరంలో ఉన్న ఓ నాయకుడు తెలిపాడు.
ప్రస్తుతం సదరు కామెంట్స్ మరాఠా రాజకీయాలలో కలకలం రేపుతున్నాయి. మంగళవారం సాయంత్రం పార్లమెంట్ లో షిండే, పార్టీ సహచరులు కూడా మీడియాతో మాట్లాడారు.
శివసేన ఎంపీ రాహుల్ షెవాలే(Rahul Shewale) మాట్లాడుతూ గత ఏడాది జూన్ లో ఉద్దవ్ ఠాక్రే ఎన్డీఏలో మళ్లీ చేరాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఎందుకనో ఏమో వెనక్కి తగ్గారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఇక ఏక్ నాథ్ షిండేతో పొత్తు పెట్టుకున్న పార్లమెంట్ లోని ప్రత్యేక శివసేన గ్రూపులో ముంబైకి చెందిన ఎంపీ అయిన షెవాలేకు ప్రముఖ పాత్ర లభించింది. ఇదిలా ఉండగా సోమవారం 12 మంది ఎంపీలు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
రాహుల్ షెవాలే నేతృత్వంలోని ప్రత్యేక శివసేన గ్రూప్ గురించి తెలియ చేశారు. తమదే అసలు సిసలైన శివసేన పార్టీ అంటూ పేర్కొన్నారు.
దీనిపై శివసేన పార్టీ చీఫ్ , మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే(Udhav Thackeray) సీరియస్ అయ్యారు. బుధవారం ఈనెల 20న షిండే, ఠాక్రే కు సంబంధించిన కేసు విచారణకు రానుంది.
Also Read : మోదీపై నిప్పులు చెరిగిన రాహుల్