Sanjay Raut : సంజయ్ రౌత్ కు ఈడీ సమన్లు జారీ
కేంద్ర సర్కార్ ను టార్గెట్ చేసిన ఎంపీ
Sanjay Raut : శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) కు కోలుకోలేని షాక్ తగిలింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ ఆరోపణలకు సంబంధించి సంజయ్ రౌత్ కు ఇవాళ సమన్లు జారీ చేసింది.
గత కొంత కాలం నుండీ సంజయ్ రౌత్ కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. కావాలని కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందంటూ ఆరోపిస్తూ వస్తున్నారు.
తాజాగా మనీ లాండరింగ్ విచారణకు సంబంధించి ఈడీ ప్రశ్నించేందుకు సమన్లు జారీ చేసింది. పత్రా చాల్ అనే హౌసింగ్ కాంప్లెక్స్ పునరాభివృద్ధిలో జరిగిన కుంభకోణానికి సంబంధించిన కేసులో సంజయ్ రౌత్ ను జూలై 1న సుమారు 10 గంటలకు పైగా విచారించింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.
ఈ కేసుకు సంబంధించి రౌత్ కుటుంబానికి చెంది ఆస్తులను అటాచ్ చేసింది. తాను ఎలాంటి తప్పులు చేయలేదని, అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు సంజయ్ రౌత్.
శివసేన పార్టీలో ఉద్దవ్ ఠాక్రే తర్వాత నెంబర్ టూగా ఉన్నారు సంజయ్ రౌత్(Sanjay Raut). తనను కావాలని టార్గెట్ చేసినా కేంద్రానికి భయపడే ప్రసక్తి లేదంటున్నారు. ముందు నుంచీ ధిక్కార స్వరాన్ని బలంగా వినిపిస్తున్నారు.
ఒక రకంగా చెప్పాలంటే శివసేన పార్టీకి మౌత్ పీస్ గా పేరొందారు సంజయ్ రౌత్. తన యుద్ధం కేంద్రంపైనని కానీ ఈడీతో కాదని, విచారణకు సహకరిస్తానని స్పష్టం చేశారు.
అంతే కాకుండా పీఎంసీ బ్యాంకు మోసానికి సంబంధించి సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్ ను కూడా ప్రశ్నించింది ఈడీ.
Also Read : రాహుల్ షెవాలే శివ సేన ఫ్లోర్ లీడర్