Arun Lal : రోహిత్ తర్వాత పంత్ కే కెప్టెన్సీ
జోష్యం చెప్పిన అరణ్ లాల్
Arun Lal : భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, కామెంటేటర్ అరుణ్ లాల్(Arun Lal) సంచలన కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ లో నిరాశ పరిచి ఇంగ్లండ్ టూర్ లో చెలరేగిన రిషబ్ పంత్ పై ప్రశంసల జల్లులు కురిపించాడు.
వికెట్ కీపర్ గా, బ్యాటర్ గా అద్భుతంగా ఆడుతున్నాడని పేర్కొన్నాడు. భారత జట్టుకు రోహిత్ శర్మ(Rohit Sharma) తర్వాత పంత్ కే కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నాడు అరుణ్ లాల్.
భారత జట్టు సీరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. పరిస్థితులకు తగ్గట్టు రాణించడం, ఒత్తిళ్లను తట్టుకోవడం పంత్ కు అలవాటైందని ఇదే అతడిని బెస్ట్ ప్లేయర్ గా నిలబెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
బీసీసీఐకి సూచన కూడా చేశాడు. వేరే ప్రయోగాలు చేయకుండా కేవలం రిషబ్ పంత్ (Rishab Pant) కే అవకాశం ఇవ్వాలని కోరాడు. జట్టులో టాప్ త్రీలో ఉన్న ఆటగాళ్లలో రిషబ్ కే ఎక్కువ అవకాశం ఉందన్నాడు అరుణ్ లాల్.
ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాడు. ఎక్కడా భేషజాలు ప్రదర్శించడు. కూల్ గా పని చేసుకుంటూ పోతాడు. ఎవరైనా ఏదైనా చెబితే విని తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తాడు.
ఇలాంటి వాళ్లే భారత జట్టుకు కావాలన్నాడు అరుణ్ లాల్(Arun Lal). పంత్ గనుక కెప్టెన్ అయితే టీమిండియాకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నాడు. అయితే మరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఒకప్పుడు భారత జట్టు డిఫెన్స్ ఆడేందుకు ట్రై చేసేది. కానీ కోహ్లీ వచ్చాక డ్రా కోసం కాకుండా గెలుపు కోసం ఆడేలా చేశాడన్నాడు.
Also Read : బెన్ స్టోక్స్ సంచలన కామెంట్స్