Yash Radhika Pandit Viral : కేజీఎఫ్ యష్ రాధిక ఫోటోలు వైరల్
షేర్ చేసిన భార్య రాధికా పండిట్
Yash Radhika Pandit Viral : కేజీఎఫ్ సినిమాతో ఓవరాల్ స్టార్ డమ్ ను సంపాదించుకున్న ఏకైక నటుడు యష్(Yash). ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ చూరగొంది.
కేజీఎఫ్ సక్సెస్ కావడంతో కేజీఎఫ్ -2 విడుదలైంది. పెద్ద ఎత్తున కోట్లు కొల్లగొట్టింది. ఈ తరుణంలో సినిమా విజయాన్ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్న నటుడు యష్ తాజాగా తన భార్య రాధికా పండిత్ , పిల్లలతో కలిసి వెకేషన్ కు వెళ్లారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి నిమిషాల్లోనే వైరల్(Viral) గా మారాయి. అందమైన ప్రదేశాలతో పాటు నోరూరించే రుచికరమైన వంటకాలను కూడా ఆస్వాదించారు.
ఈ విషయాన్ని యష్ , రాధికా పండిట్ లు స్వయంగా వెల్లడించారు. ఓ ఫోటోను జత చేస్తూ చీజ్ , జిలాటో ప్రపంచంలో సూర్యుడు ఆలస్యంగా వేలాడుతున్నాడు..ప్రస్తుతానికి చేరుకోలేమంటూ క్యాప్షన్ జత పర్చింది.
కొన్ని రోజుల కిందట రాధికా పండిట్ తన భర్త యష్(Yash Radhika Pandit) తో కలిసి నటించిన తన మొదటి చిత్రం మొగ్గిన మనసు 14 సంవత్సరాలను జరుపుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది.
ఈ చిత్రం తనకు ఎంతగానో పేరు తెచ్చిందని, ఏకంగా ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా తెచ్చి పెట్టిందని తెలిపింది రాధికా పండిట్. ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా పంచుకున్న వారందరికీ తాను థాంక్స్ చెబుతున్నట్లు పేర్కొంది.
యష్ , రాధికా 2004లో టీవీ షో నంద గోకుల సెట్స్ లో కలుసుకున్నారు. చాలా ఏళ్లు డేటింగ్ చేశాక 2016లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు ఐరా, కుమారుడు యథార్వ్.
Also Read : ఆకట్టుకుంటున్న నాగచైతన్య పోస్టర్