Ramiz Raja : భారత్ పై ఆనాటి విజయం అద్భుతం
బెంగళూరు టెస్టుపై రమీజ్ రజా కామెంట్స్
Ramiz Raja : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు శ్రీలంకపై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది మొదటి టెస్టులో.
ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్ టీం భారత దేశంలోని బెంగళూరులో జరిగిన టెస్టులో ఇండియాను ఓడించింది. శ్రీలంకపై విజయం ఆనాటి పాకిస్తాన్ భారత్ పై గెలిచిన దానిని మరోసారి గుర్తుకు తెచ్చేలా చేసిందని పేర్కొన్నాడు రమీజ్ రజా(Ramiz Raja).
1987లో బెంగళూరులో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరిగింది. తక్కువ స్కోరింగ్ టెస్టులో ఇండియాకు కోలుకోలేని షాక్ ఇచ్చింది పాకిస్తాన్. అప్పటి జట్టులో ఇప్పటి పీసీబీ చైర్మన్ రమీజ్ రజా కూడా సభ్యుడిగా ఉన్నాడు.
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం కెప్టెన్ బాబర్ ఆజమ్ కు పూర్తి స్వేచ్ఛను ఇచ్చామన్నాడు. జట్టు ఎంపికలో పూర్తి అధికారం ఇవ్వడంతో పాకిస్తాన్ జట్టు అభేద్యమైన జట్టుగా మారిందన్నాడు రమీజ్ రజా.
గాలేలో జరిగిన తొలి టెస్టులో శ్రీలంకపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది పాకిస్తాన్ జట్టు. రెండు టెస్టు మ్యాచ్ ల సీరీస్ లో పాకిస్తాన్ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది.
టెస్టు మ్యాచ్ సందర్భంగా మ్యాచ్ చివరి రోజున 342 పరుగుల భారీ టార్గెట్ ను సునాయసంగా ఛేదించింది. కాగా రన్ ఛేజింగ్ లో పాకిస్తాన్ సాధించిన అత్యుత్తమ టెస్టు విజయాలలో ఇది ఒకటి అని పేర్కొన్నారు రమీజ్ రజా(Ramiz Raja).
భారత్ పై బెంగళూరులో సాధించిన గెలుపుతో సమానమని స్పష్టం చేశాడు.
Also Read : రసవత్తర పోరులో భారత్ దే విజయం