TMC Partha Chatterjee : దోషిగా తేలితే మంత్రిపై వేటు – టీఎంసీ
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో కలకలం
TMC Partha Chatterjee : పశ్చిమ బెంగాల్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడుల దెబ్బకు కలకలం రేగింది. వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పార్థ ఛటర్జీతో పాటు విద్యా శాఖ సహాయ మంత్రి, ఎమ్మెల్యే, తదితరుల ఇళ్లపై విస్తృతంగా దాడులు చేపట్టింది.
ఇదిలా ఉండగా పార్థ ఛటర్జీ(Partha Chatterjee) సహాయకురాలిగా పేరొందిన అర్షత ఛటర్జీ ఇంట్లో ఏకంగా రూ. 20 కోట్ల రూపాయల నగదు దోరికింది. అంతే కాకుండా 20 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది.
ఈ సందర్భంగా శనివారం మంత్రి పార్థ ఛటర్జీని ఈడీ అరెస్ట్ చేసింది. మంత్రితో పాటు ఇతర సహాయకులను కూడా అరెస్ట్ చేసింది ఈడీ. ఇదే సమయంలో బీజేపీ చీఫ్ సువేందు అధికారి సంచలన కామెంట్స్ చేశారు.
సీన్ ఇంకా మిగిలే ఉందని, ఇంకొందరిని అదుపులోకి తీసుకోవడం ఖాయమని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్ లో ఉపాధ్యాయ నియామకాల కుంభకోణానికి సంబంధించిన కేసులో మంత్రిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈడీ దాడిలో ఏకంగా భారీ ఎత్తున నోట్ల కట్టలు బయట పడడం విస్తు పోయేలా చేసింది. ఈ సంఘటనపై అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్(TMC) పార్టీ స్పందించింది.
ఈ కేసులో మంత్రి పార్థ ఛటర్జీ(TMC Partha Chatterjee) దోషిగా తేలితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేసింది. అయితే కేంద్ర సర్కార్ కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ(ED) పేరుతో దాడులకు పాల్పడుతోందంటూ ఆరోపించింది.
Also Read : ప్రజా సంక్షేమమే పరమావధి కావాలి