Governor RN Ravi : తుపాకికి తుపాకీతోనే స‌మాధానం చెప్పాలి

త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ ఆర్.ఎన్.ర‌వి కామెంట్స్

Governor RN Ravi : త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ ఆర్. ఎన్. ర‌వి షాకింగ్ కామెంట్స్ చేశారు. హింస‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో స‌హించే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ మేర‌కు తుపాకికి తుపాకితోనే స‌మాధానం చెప్పాల‌న్నారు గ‌వ‌ర్న‌ర్. దేశ స‌మైక్య‌త‌, స‌మ‌గ్ర‌తకు వ్య‌తిరేకంగా, హింస‌ను వీడ‌ని వారితో చ‌ర్చ‌లు జ‌ర‌పాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొన్నారు.

ప్ర‌భుత్వం, ఇసాక్ ముయివా నేతృత్వం లోని నేష‌న‌ల్ సోష‌లిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఎన్సీసీఎన్ – ఐఎం ) మ‌ధ్య సంభాష‌ణ‌క‌ర్త‌గా కీల‌క పాత్ర పోషించారు ఆర్. ఎన్. ర‌వి(Governor RN Ravi) .

లొంగి పోవ‌డానికి కాక పోతే గ‌త ఎనిమిది సంవ‌త్స‌రాల‌లో ఏ సాయుధ స‌మూహంతోనూ చ‌ర్చ‌లు జ‌ర‌గ‌లేద‌ని చెప్పారు. నాగాలాండ్ మాజీ గ‌వ‌ర్న‌ర్ కూడా అయిన ఆర్.ఎన్. ర‌వి మాట్లాడారు.

ఎవ‌రైనా తుపాకీని ఉప‌యోగిస్తే తుపాకీతో వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. హింస‌కు స‌హ‌నం లేద‌న్నారు. దేశానికి ఇబ్బందులు క‌లిగించే వారి ప‌ట్ల ఎందుకు ద‌య‌తో ఉండాల‌ని ప్ర‌శ్నించారు త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్.

కేవ‌లం లొంగి పోయేందుకు మాత్ర‌మే చ‌ర్చ‌లు జ‌రిపామ‌ని స్ప‌ష్టం చేశారు ఆర్. ఎన్. ర‌వి. కొచ్చిలో మాన‌వ హ‌క్కుల సంఘం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు గ‌వ‌ర్న‌ర్.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. 26/11 ముంబై ఉగ్ర‌దాడి త‌ర్వాత పాకిస్తాన్ తో వ్య‌వ‌హ‌రించిన తీరుపై గ‌త కాంగ్రెస్ – యుపీఏ స‌ర్కార్ పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పంచారు ఆర్. ఎన్. ర‌వి.

పొరుగున ఉన్న మిత్ర దేశ‌మా లేక శ‌త్రు దేశ‌మా అనే విష‌యంపై స్ప‌ష్ట‌త ఉండాల‌న్నారు.

Also Read : ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై చ‌ర్చ‌కు నోటీసు

Leave A Reply

Your Email Id will not be published!