National Comment : అమ్ముకుంటూ పోతే శ్రీ‌లంక సీన్

ఇండియా రెడీ ఫ‌ర్ సేల్

National Comment : ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ పేరుతో సంబురాలు జ‌రుపుతోంది కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్ర‌భుత్వం. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ద్ర‌వ్యోల్బ‌ణం, నిరుద్యోగం పెరిగి పోతోంది.

కులాలు, మ‌తాలు, ప్రాంతాల పేరుతో ఘ‌ర్ష‌ణ‌లు ఎక్క‌డో ఒక చోటు జ‌రుగుతూనే ఉన్నాయి. బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాల‌ను కూల్చ‌డం లేదా ఇబ్బంది పెట్ట‌డం రివాజుగా మారింది.

ఇదే స‌మ‌యంలో ప్ర‌భుత్వ ఆధీనంలోని సంస్థ‌ల‌న్నింటినీ గంప గుత్త‌గా బ‌డా బాబులు, కార్పొరేట్ల‌కు , పారిశ్రామిక‌వేత్త‌ల‌కు అప్ప‌గించ‌డమో లేదా కొన్నేళ్ల పాటు లీజుకు ఇవ్వ‌డ‌మో చేస్తూ వ‌స్తోంది.

ఇక గ‌తంలో కాంగ్రెస్ పార్టీ హ‌యాంలో దివంగ‌త ఇందిరా గాంధీ బ్యాంకుల‌ను జాతీయం చేసింది. కానీ మోదీ స‌ర్కార్ వాటిని గంప గుత్త‌గా ప్రైవేట్ చేతుల్లోకి ఇచ్చేసేందుకు రెడీ అయ్యింది.

జాతీయత(National Comment) అంటే ఆస్తుల‌ను అమ్మ‌డం కాదు మోదీజీ వాటిని స‌రిదిద్ద‌డం. వాటికి పూర్వ వైభ‌వాన్ని తీసుకు రావ‌డం. ఆర్థిక రంగం అభాసు పాలైంది.

నీతి ఆయోగ్ గ‌తి త‌ప్పింది. ఎన్నిక‌లు..విజ‌యాలు కొల‌మానాలు కావు. కావాల్సింది దేశానికి బ‌ల‌మైన పునాది అవ‌స‌రం. దేశానికి దిశా నిర్దేశం చేయాల్సిన సంస్థ‌లు ఇప్పుడు ఆస‌రా కోసం ఎదురు చూస్తున్నాయి.

దేశ ఆర్థిక రంగానికి ఆయువు ప‌ట్టుగా ఉన్న వ్య‌వ‌సాయ రంగం కుదేలైంది. ఇలా ఎంత కాలం ప్రైవేట్ జ‌పం చేస్తం మోదీజీ..ఇక‌నైనా మారాలి. లేక పోతే మిగిలేది మాత్రం శ్రీ‌లంక సంక్షోభం భార‌త దేశంలో కొలువు తీర‌డం ఖాయ‌మ‌ని గుర్తుంచుకుంటే బెట‌ర్.

పాల‌కులు మేల్కోక పోతే రిపీట్ అవుతుంద‌ని గుర్తుంచు కోవాలి.

Also Read : ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై చ‌ర్చ‌కు నోటీసు

Leave A Reply

Your Email Id will not be published!