Ayman al-Zawahiri : అత‌డిని మ‌ట్టుబెట్టేందుకు 21 ఏళ్లు

అల్ ఖైదా చీఫ్ అయాన్ అల్ జ‌వ‌హ‌రి

Ayman al-Zawahiri : యావ‌త్ ప్ర‌పంచం ఒక్క‌సారిగా ఉలిక్కప‌డేలా చేసింది అమెరికా. ఒక్కసారి క‌మిట్ అయ్యాక ఇక వ‌దిలి పెట్ట‌ని మ‌న‌స్త‌త్వం ఆ దేశానిది. ప్ర‌పంచాన్ని త‌న గుప్పిట్లోకి తెచ్చుకోవాల‌ని కొన్నేళ్ల నుంచి ప్ర‌య‌త్నం చేస్తూ వ‌స్తోంది.

ఇత‌రుల‌ను భ‌య‌పెట్టే అమెరికాను బిన్ లాడెన్ అనే ఒకే ఒక్క వ్య‌క్తి కంటి మీద కునుకు లేకుండా చేశాడు. త‌న‌కు ఎదురే లేద‌ని విర్ర వీగుతున్న పెద్ద‌న్నకు చుక్క‌లు చూపించాడు.

ఏకంగా అల్ ఖైదాను స్థాపించి 2001లో అమెరికా ట‌వ‌ర్స్ పై రాకెట్ దాడి ప్ర‌యోగించాడు. దీంతో ఇత‌రుల‌ను భ‌యాందోళ‌న‌కు గురి చేస్తూ వ‌చ్చిన

యుఎస్ ఒక్క‌సారిగా వ‌ణికి పోయింది.

భ‌యంతో బెంబేలెత్తింది. ఆ త‌ర్వాత ఎవ‌రు చేశార‌నే దానిపై ప్ర‌పంచ‌మంతా గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టింది. చివ‌ర‌కు ఈ మొత్తం వ్య‌వ‌హారానికి బిన్

లాడెన్ తో పాటు అయాన్ అల్ జ‌వ‌హ‌రి (Ayman al-Zawahiri) ఉన్న‌ట్లు గుర్తించింది.

2011లో పాకిస్తాన్ లో దాక్కున్న బిన్ లాడెన్ ను మ‌ట్టుబెట్టింది. 10 సంవ‌త్స‌రాలు ప‌ట్టింది అమెరికాకు లాడెన్ ను తుద ముట్టించేందుకు.

కానీ మ‌రో కీల‌క సూత్ర‌ధారిగా భావిస్తూ వ‌చ్చిన అల్ జ‌వ‌హ‌రిని హ‌త మార్చేందుకు ఇదే అమెరికా దేశానికి 21 ఏళ్లు ప‌ట్టింది. వ‌ర‌ల్డ్ మోస్ట్ వాంటెడ్ డేంజ‌ర‌స్ టెర్ర‌రిస్ట్ గా ప్ర‌క‌టించింది అమెరికా.

ప‌లు సార్లు ట్రై చేసింది. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు అల్ జ‌వ‌హ‌రిని చంపేందుకు. దాడి చేసిన ప్ర‌తిసారి త‌ప్పించుకున్నాడు. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా

అల్ ఖైదాను విస్తృతం చేసే ప‌నిలో ప‌డ్డాడు చీఫ్‌.

ఇదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం చోటు చేసుకున్న టెక్నాల‌జీని అత్యంత శ‌క్తివంతంగా ఉప‌యోగించుకునేలా చేశాడు అల్ ఖైదాను అల్ జ‌వ‌హ‌రి. ఎక్క‌డ దాడులు జ‌రిగినా దాని వెనుక అల్ ఖైదా ఉండేలా చూశాడు.

దీంతో అమెరికాతో పాటు ఇత‌ర దేశాలు కూడా ఈ సంస్థ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండ‌డం చేశాయి. ఇక ఆఫ్గ‌నిస్తాన్ నుంచి అమెరికా ద‌ళాలు వెళ్లి పోయాక

అల్ ఖైదాకు ప‌ట్ట‌ప‌గ్గాలు లేకుండా పోయాయి.

ఇదే సుర‌క్షిత‌మ‌ని అనుకున్నాడు 71 ఏళ్ల అల్ జ‌వ‌హ‌రి. కానీ మ‌రిపించి దెబ్బ కొట్ట‌డంలో అమెరికా త‌ర్వాతే ఎవ‌రైనా. తాలిబ‌న్ల‌కు తెలియ‌కుండానే

వారి అడ్డాలో వైమానిక దాడుల‌కు దిగింది అగ్ర రాజ్యం.

ఆపై త‌మ‌ను భ‌యానికి గుర‌య్యేలా చేసిన అల్ జ‌వ‌హ‌రిని ఖ‌తం చేసింది. ఈ సంద‌ర్భంగా అమెరికా చీఫ్ జో బైడెన్ ఒకే ఒక మాట‌న్నాడు. బ‌దులు తీర్చుకున్నామ‌ని.

Also Read : అల్ ఖైదా చీఫ్ అల్-జ‌వ‌హ‌రి ఖ‌తం

Leave A Reply

Your Email Id will not be published!