Modi Harjinder Kaur : నీ విజయం యువతకు స్ఫూర్తి దాయకం
హర్జిందర్ కౌర్ కు ప్రధాని అభినందన
Modi Harjinder Kaur : వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో అద్భుతమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శించింది పంజాబ్ కు చెందిన హర్జిందర్ కౌర్. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ కీలక పోటీలో కౌర్ చివరి దాకా పోరాడింది.
కానీ కొద్ది పాటి తేడాతో రజత (సిల్వర్) పతకాన్ని కోల్పోయింది. ఈ సందర్భంగా భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ కాంస్య పతకాన్ని సాధించిన హర్జిందర్ కౌర్(Modi Harjinder Kaur) ను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియ చేశారు. నీవు సాధించిన ఈ విజయం ఎందరో భారతీయులు గర్వపడేలా చేసిందని పేర్కొన్నారు. ప్రధానంగా యువతకు ఆదర్శ ప్రాయంగా నిలిచి ఉంటుందన్నారు.
ఇలాంటి విజయాలు భవిష్యత్తులో మరిన్ని సాధించాలని కోరారు ప్రధాన మంత్రి. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు.
ఇదిలా ఉండగా హర్జిందర్ సింగ్ స్వస్థలం పంజాబ్ రాష్ట్రంలోని సభా సమీపంలోని మెహ్స్ గ్రామం. బ్రిటన్ లోని బర్మింగ్ హోమ్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ -2022 జరుగుతున్నాయి.
గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి భారత్ కు చెందిన అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శన చేపట్టారు. ఇప్పటి వరకు 9 పతకాలు సాధించారు.
ఇందులో 3 స్వర్ణాలు 3 రజతాలు 3 కాంస్య పతకాలు ఉన్నాయి. అంతే కాకుండా ఇప్పటి వరకు దేశం తరపున పతకాలు సాధించిన వారందరినీ పేరు పేరునా అభినందనలు తెలిపారు దేశ ప్రధాన మంత్రి.
దేశానికే కాదు పంజాబ్ రాష్ట్రానికి గర్వ కారణంగా నిలిచావంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కౌర్ ను అభినందలతో ముంచెత్తారు.
Also Read : హర్జిందర్ కౌర్ కు సీఎం అభినందన