AP Comment : జ‌న‌సేనానిపై జ‌నం ఆశ‌లు

పూర్తి కాని పార్టీ నిర్మాణం

AP Comment : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల‌లో సుప‌రిచితమే. ఆయ‌న గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. మెగా ఫ్యామిలికి ప్ర‌త్యేక‌మైన చ‌రిత్ర కూడా ఉంది.

గ‌తంలో అన్న చిరంజీవి ఉమ్మ‌డి ఏపీ లో ప్ర‌జారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు. ఆ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కేంద్ర మంత్రిగా ప‌ని చేశారు.

ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చారు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మున్న‌త ఆశ‌యంతో జ‌న‌సేన పార్టీని ఏర్పాటు చేశారు. ఆయ‌న ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే చేగువేరా ను ఆద‌ర్శంగా తీసుకున్నారు.

ఇటీవ‌ల జ‌రిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒక్క సీటు మాత్ర‌మే ద‌క్కింది ఆ పార్టీకి. రాష్ట్రంలో లెక్క‌లేన‌న్ని స‌మ‌స్య‌లు పేరుకుని ఉన్నాయి.

అదే స‌మ‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రానికి సంబంధించిన వ‌న‌రులు ఏమేం ఉన్నాయి. ఎలా ముందుకు తీసుకు పోవాల‌న్న దానిపై ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ ఇవ్వ‌లేక పోతున్నారు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan).

టీడీపికి మ‌ద్ద‌తు ప‌లికారు. బీజేపీతో సంబంధం పెట్టుకున్నారు. ఇక ఏపీలో వైసీపీ, టీడీపీతో పాటు బీజేపీ, జ‌న‌సేన ప్ర‌ధాన పార్టీలుగా మారాయి. ల‌క్షలాది మంది అభిమానుల‌ను క‌లిగిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై కోట్లాది మంది ఆశ‌లు(AP Comment) పెట్టుకున్నారు.

ఆయ‌న సార‌థ్యంలో జ‌న‌సేన పవ‌ర్ లోకి వ‌స్తే త‌మ బ‌తుకులు బాగు ప‌డుతాయ‌ని ఆశిస్తున్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో పార్టీ ప‌రంగా పూర్తి స్థాయిలో సంస్థాగ‌త నిర్మాణం జ‌ర‌గ‌క పోవడం ఇబ్బందిక‌రంగా మారింది.

త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏం చేస్తార‌నే దానిపై మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. పార్టీ అంటే ప్ర‌జ‌ల కోసం. అంతే కాదు నిర్మాణం కూడా. అది లేకుండా మ‌న‌గ‌ల‌డం క‌ష్టం అన్ని గుర్తు పెట్టుకోవాలి.

Also Read : కేంద్ర స‌ర్కార్ కు సుప్రీంకోర్టు నోటీసులు

Leave A Reply

Your Email Id will not be published!