Telangana Comment : అప్పుల కుప్ప జనం నెత్తిన గుదిబండ
రాష్ట్ర రుణం రూ. 3 లక్షల 12 వేల కోట్లు
Telangana Comment : ఎన్నో ఏళ్ల పోరాట ఫలితం. ఎందరో త్యాగాల, అమరవీరుల బలిదానం. ఎందరో మేధావుల , కళాకారుల సాక్షాత్కారమే తెలంగాణ రాష్ట్రం.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బోసి పోయి, దగా పడిన ప్రాంతానికి విముక్తి లభించినా ఎందుకని అప్పుల కుప్పగా మారిందో గత ఎనిమిదేళ్లుగా ఏలిన వారు చెప్పాలి.
నీళ్లు..నిధులు..నియామకాలు అనే ట్యాగ్ లైన్ తో అధికారంలోకి వచ్చిన గులాబీ దళం చివరకు ఏం మిగిల్చింది. ఈ నాలుగు కోట్ల తెలంగాణ(Telangana Comment) ప్రజలకు.
ఏకంగా రూ. 3 లక్షల 12 వేల కోట్ల అప్పు చేసింది. ఇన్ని కోట్లు ఎవరి కోసం చేశారో ఎందుకు చేశారో చెప్పాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాల ఖాళీలు ఉన్నా ఎందుకని భర్తీ చేయలేదో చెప్పాలి.
అప్పుడో ఇప్పుడో అంటూ ఊరిస్తూ వచ్చారే తప్పా ఈరోజు వరకు ఆచరణలో నింపిన దాఖలాలు లేవు. ఇక ప్రజలపై దాడులు చేసేందుకు,
కేసులు నమోదు చేసేందుకు పోలీసులను భర్తీ చేశారు తప్పా ఇతర శాఖల్లో భర్తీ చేస్తే ఒట్టు. ప్రాజెక్టుల పేరుతో, సంక్షేమ పథకాల పేరుతో కోట్లు కుమ్మరించుకుంటూ పోయారే తప్పా అసలైన వనరులను గుర్తించి ప్రజలను కార్యోన్ముఖుల్ని చేసి ఉండి ఉంటే ఇన్ని అప్పులు అయ్యేవి కావు.
పాలనా పరంగా మరింత చేరువ అయ్యేందుకు జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందుకు తగినట్లుగా ఎందుకని భర్తీ చేయలేదో ఒకసారి చూసుకోవాలి.
ఏపీ నుంచి విడి పోయి కొత్త రాష్ట్రం ఏర్పడిన తెలంగాణకు మిగులు బడ్జెట్ ఉంది. మరి ఇంత పెద్ద మొత్తంలో చేసిన అప్పుల్ని ఎవరు తీర్చాలో ఏలిన వారే చెప్పాలి.
వారే దారి చూపించాలి. అటు ఏపీ ఇటు తెలంగాణ ఇరు రాష్ట్రాలు పోటీ పడి అప్పులు చేస్తున్నాయి. ఇది మీకంటే జనంపైనే గుదిబండ అవుతుందని మాత్రం వాస్తవం.
Also Read : జనసేనానిపై జనం ఆశలు