Deepika Padukone : దీపికా పదుకొనే షాకింగ్ కామెంట్స్
ఒక్కోసారి చని పోవాలని అనిపించింది
Deepika Padukone : ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒకానొక సమయంలో తాను చని పోవాలని అనుకున్నానని పేర్కొంది. చాలా కాలం పాటు డిప్రెషన్ కు లోనైనట్లు తెలిపింది.
తన జీవిత కాలంలో ఆ రోజులు అత్యంత కష్టమైనవి, దుర్భరమైనవని వాపోయింది. దీపికా పదుకొనే ఎప్పుడు ఏ సమయం వచ్చినా తనకు జరిగిన ఇబ్బంది గురించి ప్రస్తావిస్తూనే వుంటుంది.
తాజాగా మానసిక ఆరోగ్యం గురించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న దీపికా పదుకొనే(Deepika Padukone) కీలక వ్యాఖ్యలు చేసింది. నటిగా నేను ఉన్నత స్థానంలో ఉన్నా, ఎంతో ప్రచారం లభించినా, అభిమానులను సంపాదించుకున్నా ఎందుకనో నాలో నేనే బాధ పడుతూ ఉండేదానని చెప్పింది.
కానీ ఎందుకు బాధ పడుతున్నాననో తెలియడం లేదని వాపోయింది. చాలా విషయాలు పంచు కోవాలని అనుకునే దాన్ని. కానీ నాలో నేనే నిరాశకు, అసంతృప్తికి లోనయ్యే దానినంటూ చెప్పింది దీపికా పదుకొనే.
ఎందుకో తెలియని బాధ నుంచి ఉపశమనం పొందేందుకు నిద్రను ఆశ్రయించేదానిని. కానీ అది కూడా వచ్చేది కాదు. ఎవరితోనూ మాట్లాడాలని అనిపించేది కాదు.
ఒక్కదానినే ఏడుస్తూ కూర్చునేదానిని. ఉండీ ఏం లాభం. నాకే ఎందుకు ఇలా అని సూసైడ్ ఆలోచనలు కూడా పదే పదే వచ్చేవి. ఇదే సమయంలో పేరెంట్స్ బెంగళూరులో ఉంటారు.
నన్ను చూసేందుకు అప్పుడప్పుడు వచ్చేవాళ్లు. ఈ సమయంలో మా అమ్మ నా బాధను అర్థం చేసుకుంది. నేను డిప్రెషన్ నుంచి బయట పడేందుకు కౌన్సెలింగ్ తీసుకున్నా..ఆ తర్వాత బాధ కు దూరమయ్యానని తెలిపింది దీపికా పదుకొనే.
Also Read : ఎరికా ప్యాకర్డ్ న్యూడ్ ఫోటో షూట్ వైరల్