Smriti Mandhana : చ‌రిత్ర సృష్టించిన స్మృతి మంధాన

పొట్టి ఫార్మాట్ లో అరుదైన రికార్డ్

Smriti Mandhana : బ్రిట‌న్ వేదిక‌గా జ‌రుగుతున్న కామెన్వెల్త్ గేమ్స్ -2022లో మొద‌టిసారి నిర్వ‌హిస్తున్న క్రికెట్ ఈవెంట్ తో భార‌త మ‌హిళా జ‌ట్టు శ‌నివారం ఇంగ్లండ్ తో సెమీ ఫైన‌ల్ మ్యాచ్ ఆడుతోంది.

ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు మొద‌టి మ్యాచ్ ఆసిస్ తో ఓడి పోయిన భార‌త్ ఆ త‌ర్వాత పుంజుకుంది. పాకిస్తాన్ జ‌ట్టును మ‌ట్టి క‌రిపించింది.

స్మృతి మంధాన(Smriti Mandhana) రెచ్చి పోవ‌డంతో ఘ‌న విజ‌యం న‌మోదు చేసింది. అనంత‌రం బార్బ‌డోస్ తో జ‌రిగిన మ్యాచ్ లో 100 ప‌రుగుల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ సాధించింది.

ప్ర‌స్తుతం సెమీస్ మ్యాచ్ ఆడుతోంది. ఇక ఇంగ్లండ్ తో జ‌రుగుతున్న సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగింది భార‌త జ‌ట్టు. స్మృతి మంధాన ఇంగ్లండ్ పై దుమ్ము రేపింది.

కేవ‌లం 23 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని హాఫ్ సెంచ‌రీ సాధించింది. అంత‌ర్జాతీయ పొట్టి ఫార్మాట్ టి20 లో త‌న రికార్డును తానే బద్ద‌లు కొట్టింది. ష‌ఫాలీ వ‌ర్మ‌తో క‌లిసి ఓపెన‌ర్ గా బ‌రిలోకి దిగిన మంధాన 32 బంతుల్లో 61 ప‌రుగులు చేసింది.

ఇందులో 8 ఫోర్లు మూడు సిక్స‌ర్లు ఉన్నాయి. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించింది మంధాన‌. ఇదిలా ఉండ‌గా అంత‌కు ముందు స్మృతీ మంధాన 2019లో న్యూజిలాండ్ తో జ‌రిగిన మ్యాచ్ లో కేవ‌లం 24 బంతులు ఆడి 50 ప‌రుగులు చేసింది.

రికార్డు సృష్టించింది. అంతే కాదు టి20 లో మూడో అత్యంత ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రి సాధించిన రికార్డు కూడా ఆమె పేరుతో ఉంది. 2018లో ఇంగ్లండ్ తో జ‌రిగిన మ్యాచ్ లో 25 బంతులో 50 ర‌న్స్ చేసింది స్మృతీ మంధాన‌.

Also Read : రేస్ వాక్ లో ప్రియాంక‌కు ర‌జ‌తం

Leave A Reply

Your Email Id will not be published!