CWG 2022 India Win : ఫైనల్ కు చేరిన భారత మహిళా జట్టు
సెమీ ఫైనల్ లో ఇంగ్లండ్ పరాజయం
CWG 2022 India Win : బ్రిటన్ లోని బర్మింగ్ హోమ్ వేదికగా జరుగుతున్న 22వ కామెన్వెల్త్ క్రీడల్లో భారత్ సత్తా చాటుతోంది. ఇప్పటికే పలు పతకాలను సాధించి దుమ్ము రేపుతోంది. కొత్తగా ఈ సారి మహిళా క్రికెటను ప్రవేశ పెట్టారు.
భారత మహిళా క్రికెట్ జట్టు ఇంగ్లండ్ జట్టును ఓడించి మొదటిసారిగా ఫైనల్ కు చేరింది. పతకాన్ని ఖాయం చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ సారధ్యంలోని టీమిండియా(CWG 2022 India Win) అన్ని రంగాలలో రాణించింది.
మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఓడి పోయింది. దాయాది పాకిస్తాన్ ను మట్టి కరిపించింది. బార్బడోస్ జట్టును 100 పరుగుల తేడాతో షాక్ ఇచ్చింది.
తాజాగా సెమీ ఫైనల్ లో వరల్డ్ ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో కొనసాగుతున్న ఇంగ్లండ్ కు దిమ్మ తిరిగేలా బదులు చెప్పింది. నువ్వా నేనా
అన్న రీతిలో చివరి వరకు సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది.
ఉత్కంఠ భరితంగా సాగింది చివరి ఓవర్ వరకు. 4 పరుగుల తేడాతో గెలుపు సాధించి చరిత్ర సృష్టించింది. టాస్ గెలిచి భారత్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
స్టార్ బ్యాటర్ స్మృతీ మంధాన ఆకాశమే హద్దుగా చెలరేగింది. 32 బంతుల్లో 8 ఫోర్లు 3 సిక్సర్లతో 61 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ 31 బంతుల్లో 7 ఫోర్లతో 41 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది.
దీంతో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు చివరి దాకా పోరాడింది. ఆరంభంలో ధాటిగా ఆడింది.
నతాలీ సీవర్ 41 రన్స్ చేసింది. అప్పటి దాకా ఇండియా ఆశలు వదులుకుంది. అద్భుత బంతికి రనౌట్ కావడంతో ఒక్కసారిగా మ్యాచ్ టర్న్ అయ్యింది.
ఇక చివరి ఓవర్ లో 14 రన్స్ కావాల్సి వచ్చింది. స్నేహ్ రాణా 28 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. ఆఖరు ఓవర్ లో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చింది. దీంతో భారత జట్టు ఉత్కంఠ భరిత విజయాన్ని నమోదు చేసింది.
Also Read : విండీస్ పై భారత్ గ్రాండ్ విక్టరీ