Ashvini Vaishnav : పని చేస్తే ఓకే లేక పోతే తొలగింపే
బీఎస్ఎన్ఎల్ సిబ్బందికి వార్నింగ్
Ashvini Vaishnav : దేశంలో రోజు రోజుకు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం జరుగుతోంది. ప్రైవేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతూ, కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తూ ముందుకు సాగుతున్నది మోదీ ప్రభుత్వం.
ఇప్పటికే కోట్లాది రూపాయలు కొల్లగొట్టి, ప్రభుత్వ బ్యాంకులను కునారిల్లేలా చేసిన వారందరు దేశం దాటి వెళ్లి పోయినా వారిని ఈరోజు వరకు తీసుకు వచ్చిన దాఖలాలు లేవు. కానీ దేశానికి విశిష్ట సేవలు అందిస్తూ వచ్చిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్ ) ఇవాళ బేల స్థితిని ఎదుర్కొంటోంది.
సాయం కోసం ఎదురు చూస్తోంది. తాజాగా కేంద్రం తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. పని చేయాలని మెరుగైన ఫలితాలు రావాలని లేక పోతే ఇంటికి పంపిస్తామంటూ కేంద్ర మంత్రి వైష్ణవ్(Ashvini Vaishnav) హెచ్చరించారు.
దేశ వ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ కు విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇప్పటికే ఎయిర్ ఇండియాను అమ్మేశారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసీని కూడా ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు.
బ్యాంకులను కూడా గంప గుత్తగా ప్రైవేట్ పరం చేయాలని యత్నిస్తోంది మోదీ సర్కార్. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ లో 62 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అంటే ఇక వారికి కూడా మూడిందని అర్థం. పని చేత కాక పోతే ఇళ్లకు వెళ్లాలని లేకుంటే తామే గెంటి వేస్తామని ప్రకటించారు.
ఇలా ఎంత కాలం మిమ్మల్ని, మీ భారాన్ని మోయలేమన్నారు కేంద్ర మంత్రి. రైల్వేలో చేసినట్లు వీఆర్ఎస్ అమలు చేస్తామన్నారు.
Also Read : అట్టడుగు నుంచి అత్యున్నత స్థానం దాకా